Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్!
మధ్యాహ్నం భోజనానికి బాక్స్ లో ఏం తీసుకెళ్లాలి? పిల్లలకి ఎలాంటి వెరైటీ చేసి పెట్టాలి? అని రోజూ ఆలోచించి విసిగిపోయారా? అయితే ఎలాంటి హడావిడి లేకుండా, క్షణాల్లో చేసుకోగలిగే అద్భుతమైన రెసిపీ బెండకాయ రైస్.
దీనికి ప్రత్యేకంగా కుర్మాలు, గ్రేవీలు లాంటి సైడ్ డిష్ లు ఏమీ అవసరం లేదు. కొద్దిగా చల్లని రైతా లేదా క్రిస్పీ పనీర్ ఫ్రై పక్కన ఉంటే చాలు.. లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే. నోటికి కమ్మగా, ఎంతో రుచిగా ఉండే బెండకాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బెండకాయ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - ఒకటిన్నర కప్పులు
బెండకాయలు - 250 గ్రాములు
శనగ పప్పు - 1 టీస్పూన్
మినప పప్పు - 1 టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
పల్లీలు (వేరుశనగ గుళ్ళు) - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 3
కరివేపాకు - కొద్దిగా
పుట్నాలు (వేయించిన శనగపప్పు) - 1 టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
సోంపు - పావు టీస్పూన్
కారం - అర టీస్పూన్
బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 1 టీస్పూన్
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!
బెండకాయ రైస్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 1 టీస్పూన్ శనగ పప్పు, 1 టీస్పూన్ మినప పప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 ఎండుమిర్చి వేసి మంటను సిమ్ లో ఉంచి దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చివరగా కొంచెం కరివేపాకు, 1 టీస్పూన్ పుట్నాలు వేసి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం బరకగా (కోర్స్ పౌడర్లా) మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, పావు టీస్పూన్ సోంపు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేలా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో 250 గ్రాముల సన్నగా తరిగిన బెండకాయ ముక్కలను వేసి కలపాలి. మంటను పూర్తిగా తక్కువ ఉంచి బెండకాయలను మగ్గనివ్వాలి. ముక్కలు బాగా వేగి దగ్గరపడే వరకు ఉంచాలి. ఈ దశలో అస్సలు ఉప్పు వేయకూడదు. ముందే ఉప్పు వేస్తే బెండకాయ జిగురు వచ్చేసి ముద్దలా తయారవుతుంది.
-బెండకాయ ముక్కలు బాగా మగ్గాక, అందులో అర టీస్పూన్ కారం వేసి మరో 5 నిమిషాల పాటు తక్కువ మంటపై అలాగే ఉంచాలి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి చల్లి బాగా కలపాలి. దీనివల్ల బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయి, ముక్కలు ఎంతో క్రిస్పీగా, కరకరలాడుతూ వేగుతాయి.
-బెండకాయ ముక్కలు కరకరలాడుతూ వేగిన తర్వాత.. మీ రుచికి సరిపడా (1 టీస్పూన్) ఉప్పు, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసి కలుపుకోవాలి. వెంటనే ఒకటిన్నర కప్పుల పొడిపొడిగా వండిన అన్నం వేసి, పైన 1 టీస్పూన్ కమ్మటి నెయ్యి వేయాలి. మసాలా అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే బెండకాయ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
