Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
బెంగాళీ స్పెషల్ 'మాచ్చర్ జోల్'..వీధిలో వెళ్లేవాళ్లు కూడా వాసనకి పరిగెత్తుకొస్తారు..ఇదిగో రెపిపి
భిన్నమైన రుచులు ఆస్వాదించేవాళ్లకి బెంగాళీ స్పెషల్ మాచ్చర్ జోల్(machhar jhol) ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. పులుపు లేకుండా,కారం మితంగా ఘాటైన పరిమళంలో ఉండే ఈ బెంగాళీ స్టైల్ చేపల పులుసు తింటే నాలుక నాట్యమాడాల్సిందే. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బెంగాల్ స్పెషల్ మచ్చర్ జోల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మాచ్చర్ జోల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొచ్చె చేప ముక్కలు
-ఎండుమిర్చి
-ఉప్పు
-కారం
-పసుపు
-ఆవనూనె
-బంగాళదుంప
-అల్లం
-కళోంజి
-ఉల్లిపాయ
-బిర్యానీ ఆకు

మాచి జోల్ తయరీ విధానం
-ముందుగా శుభ్రంగా కడిగిన అరకిలో బొచ్చె చేప ముక్కలను లోతుగా ఉండే పాన్ లో వేయండి. చేప ముక్కలలో 1 టీస్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి అన్నీ ముక్కలకు పట్టేలా చేతులతో కలుపుకోండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 8 ఎండుమిర్చి, రెండు ఇంచుల అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి. తర్వాత అందులో కొంచెం నీళ్లు మళ్లీ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి దానిని ఓ బౌల్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అరకప్పు ఆవాల నూనె పోడి వేడయ్యాక అందులో చేప ముక్కలను వేసి కదపకుండా 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. మంటను మీడియం ప్లేమ్ మీద ఉంచాలి.
-5 నిమిషాల తర్వాత చేప ముక్కలను తిరగేస్తూ ముక్క రెండు వైపులా ఎర్రగా అయ్యేలా వేపుకొని వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో ఉన్న నూనెలోనే 3 బంగాళదుంపలు చెక్కు తీసి పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి. బంగాళదుంప ముక్కలు క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న నూనెలోనే 3 బిర్యానీ ఆకులు, పావు టీస్పూన్ కళోంజి, అరకప్పు ఉల్లిపాయ చీలికలు వేసి వేపండి.
-ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం జీలకర్ర ఎండుమిర్చి పేస్ట్ ని వేసేసి నూనె పైకి తేలేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి.
-తర్వాత అందులో మెత్తగా గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోండి. టమాటో పేస్ట్ వేగేటప్పుడు అందులో అర టీస్పూన్ పంచదార కూడా వేసి కలిపి మూత పెట్టండి.
-టమాటో పేస్ట్ వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో 1 టీస్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు,1 టీస్పూన్ ధనియాల పొడి,అర టీస్పూన్ కశ్మీరీ కారం, 4 టేబుల్ స్పూన్ల నీళ్లు, సరిపడా ఉప్పు వేసి వేపుకోండి. కారాలు వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో వేయించిన బంగాళదుంప ముక్కలు, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి హై ప్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత అందులో ఎర్రగా వేపుకున్న చేప ముక్కలను వేసి మూత పెట్టి 15 నిమిషాలు మంటను సిమ్ లో పెట్టండి.
-తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే మాచ్చర్ జోల్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications