Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..కర్ణాటక స్పెషల్ పెరుగు చట్నీ
ప్రతి రోజూ మన ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేవి ఇడ్లీ లేదా దోసె. అయితే వీటిని ఎంత ఇష్టంగా చేసుకున్నా, వాటిలోకి ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీనే మళ్లీ మళ్లీ తింటుంటే ఎవరికైనా బోర్ కొట్టడం సహజం. ఏదైనా కొత్తగా, కమ్మగా తినాలనిపిస్తుందా? అయితే ఈసారి మీ బ్రేక్ ఫాస్ట్ ని మరింత రుచికరంగా మార్చుకోవడానికి కర్ణాటక ఫేమస్ పెరుగు చట్నీని ప్రయత్నించండి.
సాధారణ చట్నీల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో వాడే నువ్వులు, ధనియాలు, చిక్కటి పెరుగు కలయిక వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన కమ్మటి రుచి వస్తుంది. చూడటానికి కారం చట్నీలా కనిపించినా, రుచి చూస్తే మాత్రం ఆహా అనాల్సిందే. ఒక్కసారి ఈ చట్నీని మీ ఇంట్లో వారికి రుచి చూపిస్తే ఇకపై ఇడ్లీ, దోసెల్లోకి ఇదే కావాలని అడుగుతారు. రుచికరమైన, సులభమైన కర్ణాటక స్టైల్ పెరుగు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఎండు మిరపకాయలు: 5
మినపప్పు: 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
నువ్వులు: 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 3
ఉల్లిపాయ: 1 చిన్నది
పుల్లటి పెరుగు: అర కప్పు
కొత్తిమీర: కొద్దిగా
నూనె: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె - 1 స్పూన్
ఆవాలు - అర స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక చెంచా నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండు మిరపకాయలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మినపప్పు, ధనియాలు వేసి, మినపప్పు కాస్త ఎర్రగా మారి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులోనే నువ్వులు, జీలకర్ర, ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించి, ఆపై తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి.
-వేయించిన పదార్థాలన్నింటినీ కాసేపు చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
-పొడి నలిగిన తర్వాత, అందులో అర కప్పు పెరుగు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఈ చట్నీ తాలింపు లేకపోయినా బాగుంటుంది. కానీ మరింత రుచి కోసం చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, తాజా కరివేపాకు వేసి వేయించి, చట్నీలో కలుపుకుంటే ఆ రుచే వేరు.
-చివరగా కొత్తిమీర చల్లుకోండి. అంతే ఎంతో కమ్మని, ఘుమఘుమలాడే కర్ణాటక స్టైల్ పెరుగు చట్నీ రెడీ.
-వేడి వేడి ఇడ్లీలు, మెత్తటి దోసెలు లేదా ఊతప్పంలోకి ఈ చట్నీ అద్భుతమైన కాంబినేషన్. అన్నంలోకి కూడా ఇది చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications