Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పూరీ,చపాతీలోకి అదిరిపోయే కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ చన్నా మసాలా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఉదయం లేవగానే వేడి వేడి పూరీనో లేదా మెత్తటి చపాతీనో టిఫిన్ ప్లేట్ లోకి వస్తే దాంతో పాటు నంచుకోవడానికి సరైన కూర లేకపోతే ఆ టిఫిన్ అసంపూర్ణంగా అనిపిస్తుంది. పూరీ, చపాతీ, బటర్ నాన్ వంటి వాటికి చన్నా మసాలా(చోలే) కంటే బెస్ట్ సైడ్ డిష్ మరొకటి లేదు.
సరైన మసాలా దినుసులు వాడితే, ఇంట్లో కూడా రెస్టారెంట్ రుచిని మించిన చన్నా మసాలాను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు హడావిడిగా ఉన్నప్పుడు, ఆఫీసుకి వెళ్ళే తొందరలో ఉన్నప్పుడు గంటల తరబడి వంటగదిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చన్నా మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కాబూలీ శనగలు- 1 కప్పు
చిక్కటి పెరుగు - 1 కప్పు
శనగపిండి - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
అల్లం తురుము - కొద్దిగా
పసుపు - చిటికెడు
కారం - రుచికి సరిపడా
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర పొడి - అర స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 స్పూన్
టమోటా - 2
ఉల్లిపాయ - 1
కసూరి మేథి - 1 స్పూన్
ఇంగువ - చిటికెడు
గరం మసాలా - అర స్పూన్
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు చిక్కటి పెరుగు, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కసూరి మేథి వేసి వేయించాలి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు, చిటికెడు పసుపు, ఇంగువ వేసి టమోటాలు మెత్తగా గుజ్జులా అయ్యేవరకు వేయించాలి.
-టమోటాలు మెత్తబడ్డాక ముందుగా మిక్సీ పట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని పాన్ లో వేయాలి. పెరుగు విరిగిపోకుండా ఉండటానికి వెంటనే కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం నూనె పైకి తేలేంత వరకు అంటే సుమారు 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి.
-గ్రేవీ ఉడుకుతుండగా ముందు రోజు రాత్రి నానబెట్టి, ఉదయాన్నే కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న కాబూలీ శనగలను ఇందులో వేయాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలపాలి. మరో 3 నిమిషాలు గ్రేవీ చిక్కబడే వరకు మరిగించి, చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ చన్నా మసాలా రెడీ. పెరుగు, శనగపిండి కాంబినేషన్లో చేసే ఈ వెరైటీ చన్నా మసాలా.. పూరీ, చపాతీలే కాకుండా పులావ్, రైస్ బాత్ వంటి వాటికి కూడా రుచిని రెట్టింపు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
