Latest Updates
-
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే! -
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే!
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక
చలికాలం దాదాపుగా వచ్చేసింది. చల్లటి వాతావరణం ఉన్న సమయంలో గొంతులో వేడి వేడిగా ఏదైనా సూప్ దిగుతుంటే ఆ కిక్కే వేరు. అందులోనూ హెల్తీగా ఉండే టమాటో కొత్తిమీర కాడల సూప్ అయితే ఇక స్వర్గానికి బెత్తెడే దూరం అన్నట్లు ఉంటుంది ఫీలింగ్. కశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు దీనిని ఎక్కవగా తయారుచేసుకుని ఆస్వాదిస్తుంటారు. చలికాలంలో రోజూ దీన్ని తాగుతుంటారు.
స్వచ్చమైన దేశీయ సూప్ ఇది, గుమగుమలాడుతూ భలే రుచిగా ఉంటుంది. చలివల్ల కలిగే ఇబ్బందుల నుంచి స్వాంతన ఇస్తుంది ఈ సూప్. జలుబు, జ్వరం, నోరు బాగోలేనప్పుడు, డైట్ లో ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని సూప్ లా తాగడమే కాకుండా ఇడ్లీలను ముంచుకుంటూ తింటే కూడా అద్భుతంగా ఉంటుంది. టమాటో కొత్తిమీర కాడల సూప్ మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి లేదా వెన్న
-నూనె
-టమాటోలు
-కొత్తిమీర కాడలు
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-మిరియాలు
-అల్లం
-వెల్లుల్లి
-యాలకలు
-గోధుమ పిండి
-పచ్చిమిరపకాయలు
-నీళ్లు
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్!
టమాటో కొత్తిమీర కాడల సూప్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. అందులో అర టీస్పూన్ నెయ్యి లేదా వెన్న, 1 టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక అందులో 3 దంచిన వెల్లుల్లి, 1 బిర్యానీ ఆకు, అర చెంచా మిరియాలు, అర ఇంచు దంచిన అల్లం, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 యాలకలు వేసి బాగా ఫ్రై చేయ్యండి.
-అవి వేగాక అందులోనే 1 టీస్పూన్ గోధుమ పిండి(wheat flour) వేసి ఇది ఎర్రగా అయ్యి మంచి సువాసన వచ్చేదాకా తక్కువ మంట మీద వేయించాలి.
-గోధుమపిండి మంచి సువాసన వచ్చాక అప్పుడు అందులో 3 పెద్ద టమాటోల మీడియం సైజ్ ముక్కలు వేసి 4 నిమిషాలు వేయించుకోవాలి. వేయించేటప్పుడే ఇందులో దాదాపు 100 గ్రాముల వరకు కేవలం కొత్తిమీర కాడలు వేసుకోండి. ఇందులోనే అరచెంచా కారం వేసి బాగా కలుపుకోండి. 2 పచ్చిమిరపకాయలును పెద్ద సైజు ముక్కలుగా తుంచి వేసి బాగా కలుపుకుని తక్కువ మంట మీదనే టమాటోలు పూర్తిగా గుజ్జుగా అయ్యేదాకా మగ్గించుకోవాలి.
-టమాటో ముక్కలు, కొత్తిమీర కాడలు గుజ్జులాగా అయ్యాక అప్పుడు అందులో అర లీటరు నీళ్లు పోసి తక్కువ మంట మీద నిదానంగా మరగనివ్వాలి. బాగా మరిగి ఇది 300 ml అయ్యేదాకా మరిగించి స్టవ్ ఆపేసి దీనిని జాలి గిన్నెలో వేసి గరిటతో మెదుపుకుంటూ సారాన్ని మొత్తం వడకట్టుకోండి.
-వడకట్టుకున్న సూప్ లో కొంచెం కొత్తిమీర ఆకులు చల్లుకోండి. అంతే టమాటో కొత్తిమీర కాడల సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
