Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
నోట్లో ఇట్టే కరిగిపోయే మక్మాల్ పనీర్..రుచి అమోఘం!
మక్మాల్ పనీర్..పేరుకు తగ్గట్టే ఈ కూర చాలా మృదువుగా, క్రీమీగా ఉంటుంది. మక్మాల్ అంటే హిందీలో వెల్వెట్ అని అర్థం. ఈ కూర టెక్చర్ చాలా స్మూత్ గా, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.
ఇది సాధారణ పనీర్ బటర్ మసాలా కంటే భిన్నంగా, కాజు బటర్ మిశ్రమంతో లేత పసుపు రంగులో ఉంటుంది. మక్మాల్ పనీర్ కర్రీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-పాలు
-వెనిగర్
-లవంగ మొగ్గలు
-దాల్చిన చెక్క
-ఉల్లిపాయ
-జీడిపప్పు
-పచ్చిమిర్చి
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కర్బూజ గింజలు
-ఫ్రెష్ క్రీమ్
-వెన్న
-నూనె
-పసుపు
-టమాటో తరుగు
-బిర్యానీ ఆకు
-క్యాప్సికమ్
-జీలకర్ర పొడి
-వెల్లుల్లి తరుగు
-యాలకులు
-ధనియాల పొడి
-కసూరి మేతి
-ఉప్పు
తయారీ విధానం
-ముందుగా 1 లీటరు పాలను కలుపుతూ మరిగించాలి. 2-3 పొంగులు రాగానే స్టవ్ ఆపేసి దించేయాలి.
-ఇప్పుడు అరకప్పు నీళ్లలో 1/3 కప్పు వెనిగర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మరిగించిన పాలలో కొద్ది కొద్దిగా చేర్చుకుంటూ నెమ్మదిగా గరిటతో కలిపాయి. దీంతో పాలకు పాలు,నీళ్లకు నీళ్లు విడిపడతాయి.
-విడిపడగానే పాల మిశ్రమం(పాల మిశ్రమం) తీసి ఓ జల్లెడలో వేసి పక్కన పెట్టుకోండి. దీని మీద చల్లటి నీళ్లను పోసి కలిపిస్తే వెనిగర్ లోని పులుపు మొత్తం దిగిపోతుంది. ఇలాగే పనీర్ మిశ్రమాన్ని జల్లెడలో వదిలేయండి.
-తర్వాత గ్రేవీ కోసం మిక్సీ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కర్బూజ గింజలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, 3లవంగ మొగ్గలు వేసి కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల వెన్న, 2 చెంచాల నూనె వేడి చెయ్యాలి. వెన్న కరుగుతూ ఉన్న సమయంలోనే అందులో చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి కాస్త వేగితే చాలు మరీ ఎర్రగా వెల్లుల్లి వేగకూడదు.
-వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అందులో 1/3 కప్పు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లి లేత గులాబీ రంగులోకి వచ్చేవరకు వేపాలి.
-ఉల్లిపాయ తరుగు రంగు మారుతున్న సమయంలో అందులో 1 టేబుల్ స్పూన్ ప్రెష్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేపాక అరకప్పు టమాటో తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ వేయించిన ధనియాల పొడి, కాస్త నిలిపిన కసూరి మేతీ, కొంచెం నీరు వేసి వేయించుకోవాలి.
-నూనె పైకి తేలుతున్న సమయంలో అందులో 1/4 కప్పు సన్నని క్యాప్సికమ్ తరుగు వేసి 2-3 నిమిషాలు వేయించాక పాన్ లోనే 1/3 కప్పు నీళ్లు పోసి వేయించుకుంటే క్యాప్సికమ్ మెత్తబడుతుంది.
-కూర దగ్గరపడ్డాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు కర్జూజ పేస్ట్ వేసి కప్పుంబావు నీళ్లు కూడా పోసి కలుపుకొని కూరని దగ్గరగా,నూనె పైకి తేలేంతవరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించుకోవాలి.
-తర్వాత జల్లెడలో ఉంచిన పనీర్ ను తీసి స్టవ్ మీద ఉన్నకూరలో వేసి,అరకప్పు కాచిన పాలు కూడా పోసి కలిపి కాస్త ఉడుకుపట్టనివ్వాలి.
-కూర కాస్త ఉడుకుపట్టిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు కూరలో 2టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర తరుగు కొంచెం వేసి కలుపుకోండి. అంతే మక్మాల్ పనీర్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications

