Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే..
గోదావరి జిల్లాల వంటకాలు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది భీమవరం నాన్ వెజ్ స్పెషల్స్. అందులోనూ ఘుమఘుమలాడే చిట్టి రొయ్యల బిర్యానీ రుచి చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ వీకెండ్ కు ఈ రెసిపీని ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్లంతా వహ్వా అనకమానరు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే లేత రొయ్యలు, దానికి తోడు ఘాటైన మసాలాల కలయికతో చేసే భీమవరం చిట్టి రొయ్యల బిర్యానీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

భీమవరం చిట్టి రొయ్యల బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-చిట్టి రొయ్యలు
-బాస్మతి బియ్యం
-జాపత్రి
-అనాస పువ్వు
-మిరియాలు
-షాజీరా
-నూనె
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-యాలకులు
-లవంగాలు
-ఉల్లిపాయలు
-టమాటాలు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పసుపు
-కారం
-ఉప్పు
-వెల్లుల్లి తరుగు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-కరివేపాకు
-గరం మసాలా
-చిల్లీ ఫ్లేక్స్
-నెయ్యి
-కొత్తిమీర
-నీళ్లు
భీమవరం చిట్టి రొయ్యల బిర్యానీ తయారీ విధానం
-ముందుగా భీమవరం స్పెషల్ మసాలా చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో 1 బిర్యానీ ఆకు, 1 అంగుళం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసి వేయించాలి.
-ఇప్పుడు పాన్ లో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాక ఇందులోనే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న 2 టమాటోల పేస్ట్ పాన్ లో వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి
-ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మగ్గించి ఈ స్పెషల్ మసాలాను పాన్ లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు రొయ్యలను ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 ఎండుమిరపకాయల ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అందులో శుభ్రం చేసుకున్న 750 గ్రాముల రొయ్యలు, 1 టీస్పూన్ పసుపు వేసి కలపాలి. రొయ్యల్లోని నీరంతా ఇగిరిపోయేదాకా ఉడికించి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న భీమవరం మసాలాను 2 టేబుల్ స్పూన్లు వేసి, కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీ చిక్కబడేలా ఉడికించాలి. చివరగా నెయ్యి, కొత్తిమీర చల్లుకుని దించేయాలి.
-ఇప్పుడు బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో 3 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, 2 అంగుళాలు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 జాపత్రి, 10 మిరియాలు, ఒకటిన్నర టీస్పూన్ షాజీరా వేసి వేయించాలి. తర్వాత ఇందులో 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 టీస్పూన్లు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి చ్చివాసన పోయేదాకా దోరగా వేయించాలి
-ఇప్పుడు అందులో అర కప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర వేసి కలిపి నాలుగున్న కప్పులు నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న 3 కప్పుల బాస్మతి బియ్యం వేసి కలపాలి. ముందుగా హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు, ఆ తర్వాత మూతపెట్టి లో ఫ్లేమ్ లో 3 నిమిషాలు ఉడికిస్తే పొడిపొడిలాడే బగారా రైస్ రెడీ.
-వేడి వేడి బగారా రైస్‌లో, ఘుమఘుమలాడే రొయ్యల ఫ్రై కలుపుకుని తింటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications