Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
భోగి ప్రసాదం..దేవుడికి ఇష్టమైన నువ్వుల పులగం.. ఇలా చేస్తే రుచి అద్భుతం
తెలుగువారి లోగిళ్ళలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి. ఈ ఏడాది భోగి పండుగను ఇవాళ(జనవరి 14,2026)జరుపుకుంటున్నాం. భోగి రోజున తలస్నానం ఆచరించిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పులగం(నువ్వులు కలిపిన అన్నం) సమర్పించడం ఆనవాయితీ.
దీనిని కొన్ని ప్రాంతాల్లో నువ్వుల అన్నం లేదా చిమ్మిలి అన్నం అని కూడా అంటారు. భోగి పండుగ శీతాకాలం చివరలో, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు అవసరం.

అందుకే మన పూర్వీకులు భోగి రోజున నువ్వుల పులగం తినే సంప్రదాయాన్ని పెట్టారు. నువ్వులు, నెయ్యి శరీరానికి వేడిని ఇస్తాయి, పెసరపప్పు సులభంగా జీర్ణమవుతుంది. భోగి స్పెషల్ నువ్వుల పులగం ఎలాతయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
కొత్త బియ్యం: 1 కప్పు
పొట్టు పెసరపప్పు (సాయి పప్పు): అర కప్పు
నువ్వులు (నల్లవి లేదా తెల్లవి): 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
మిరియాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
అల్లం: 1 అంగుళం ముక్క
కరివేపాకు: 2 రెమ్మలు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 4 కప్పులు
ఎండుమిరపకాయలు: 2
జీడిపప్పు: గుప్పెడు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పును తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి, సుమారు 20-30 నిమిషాల పాటు నానబెట్టండి. పెసరపప్పును నానబెట్టే ముందు దోరగా వేయించి కడిగితే పులగం మరింత కమ్మని వాసన వస్తుంది.
-తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టి అందులో నువ్వులను వేసి నూనె లేకుండా వేయించాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి అందులో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు వేసి, దానికి తగినట్లుగా 1:3 లేదా 1:4 నిష్పత్తిలో నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ఆవిరి పోయాక అన్నాన్ని ఒకసారి కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కాక జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. అదే నేతిలో జీలకర్ర, దంచిన మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.
-తాలింపు వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా తాలింపులో వేసి ఒక్క నిమిషం వేయించండి.
-ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న అన్నం-పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన జీడిపప్పును చల్లుకోండి.
-ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన భోగి స్పెషల్ నువ్వుల పులగం దేవుడికి నివేదించడానికి రెడీ.
-దీనిని చట్నీతో లేదా సాంబార్ తో తినవచ్చు లేదా అలాగే తిన్నా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications