Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి
ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు అనేది సగటు భోజనప్రియుల మాట. ప్రతి సండే అదే రొటీన్ చికెన్ కూర, చికెన్ ఫ్రై తిని బోర్ కొట్టిందా? అయితే ఈ వారం తమిళనాడులోని మధురై స్టైల్ చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి. వేడి వేడి అన్నం, బిర్యానీతో పాటే కాకుండా దోసె, చపాతీ, పూరీ, పరోటాలలోకి ఇది అద్భుతమైన సైడ్ డిష్.

మధురై కొత్తు కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ - అర కిలో
చిన్న ఉల్లిపాయల పేస్ట్ - అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - రుచికి తగినంత
నీరు - అర కప్పు
కొబ్బరి నూనె - 1 టీస్పూన్
కొబ్బరి నూనె - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
ఎండు మిరపకాయలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
పసుపు - చిటికెడు
మిరియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - కొద్దిగా
మధురై కొత్తు కర్రీ తయారీ విధానం
-ముందుగా బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయలను మెత్తగా నూరి పేస్ట్ లా సిద్ధం చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి, అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయండి. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అందులో వేయండి. అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి, కుక్కర్ మూతపెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
-తర్వాత మూత తీసి, ఉడికిన చికెన్ ముక్కలను ఒక గరిటెతో కానీ, స్మాషర్ తో కానీ బాగా మెత్తగా (కైమాలా) చిదుముకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి కొబ్బరి నూనె వేడి చేశాక సోంపు వేసి వేయించాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక దంచిన ఎండుమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి, మెత్తగా చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి ఉల్లిపాయలతో కలిసేలా కలపండి. ఆ తర్వాత కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా చల్లుకుని చికెన్‌కు మసాలాలన్నీ బాగా పట్టేలా వేయించండి.
-మసాలాల పచ్చివాసన పోయి, కూర గుమగుమలాడుతున్నప్పుడు, పైన గుప్పెడు కరివేపాకు చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన, స్పైసీ మధురై స్టైల్ చికెన్ కొత్తు కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
