Latest Updates
-
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు!
ఇడ్లీ,దోశల్లోకి ప్రతిరోజూ చేసే పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, లేదా సాధారణ టొమాటో చట్నీలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈ రోజు మీ వంటింట్లో ఉండే తాజా కొత్తిమీరతో ఓ అద్భుతమైన చట్నీని ట్రై చేయండి. ఈ చట్నీ రుచి చూశారంటే, ఇంట్లో వాళ్ళు ప్రతిరోజూ తినేదాని కంటే కచ్చితంగా రెండు ఇడ్లీలు లేదా దోశలు అదనంగా లాగించేస్తారు.
సాధారణంగా మనం కొత్తిమీరతో చట్నీ చేస్తుంటాం, కానీ దానికి చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు), అలాగే కాస్త పులుపు తోడైతే ఆ రుచే వేరు. ఈ ప్రత్యేకమైన కొత్తిమీర-ఉల్లిపాయ చట్నీ నోటికి ఎంతో రుచిగా తగులుతూ బ్రేక్ ఫాస్ట్ రుచిని ఓ రేంజ్లో పెంచుతుంది. దీని తయారీ విధానం కూడా చాలా సులభం. తక్కువ సమయంలో ఈ సూపర్ టేస్టీ చట్నీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కొత్తిమీర-ఉల్లిపాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 1 టీస్పూన్
మినపపప్పు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
ధనియాలు - ఒక చిటికెడు
పసుపు - ఒక చిటికెడు
పచ్చి మిరపకాయలు - 2
సాంబార్ ఉల్లిపాయలు- 10
తాజా కొత్తిమీర - 1 కప్పు
చింతపండు గుజ్జు - పావు టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
కొత్తిమీర-ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టి అందులో అర టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి.
-నూనె వేడెక్కాక అందులో మినపపప్పు, ఎండు మిరపకాయలు, చిటికెడు ధనియాలు,కాస్త పసుపు వేసి దోరగా వేయించుకోండి. ఇవి మంచి సువాసన వస్తూ, బంగారు రంగులోకి మారేంత వరకు సన్నని మంట మీద వేయించి, ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే బాండీలో ఇంకో అర టీస్పూన్ నూనె వేయండి. ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు(సాంబార్ ఉల్లిపాయలు), పచ్చి మిరపకాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడి, పచ్చివాసన పోయేలా వేగాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత మంటను తగ్గించి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులో వేసి బాగా కలపండి. కొత్తిమీర ఆకులు వేడికి కొద్దిగా మగ్గడం మొదలవ్వగానే స్టవ్ ఆపేయండి. ఆ బాండీ ఉన్న వేడికే కొత్తిమీర మరింత మగ్గుతుంది. కొత్తిమీరను మరీ ఎక్కువగా వేయిస్తే దాని రుచి మారుతుంది.
-ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మినపపప్పు వేసుకున్న మిక్సీ జార్ లోనే వేయండి. ఇందులోనే పావు టీస్పూన్ చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి దీనిలో నీళ్లు అసలు కలపకుండా మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీరలో ఉండే తేమ వల్లే ఇది మెత్తని పేస్ట్ లా మారుతుంది.
-అంతే నోరూరించే కొత్తిమీర-ఉల్లిపాయ చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీల పైన కాస్త నెయ్యి వేసుకుని, ఈ చట్నీతో తింటుంటే ఆ మజాయే వేరు. దోశ, వడ లాంటి ఏ బ్రేక్ ఫాస్ట్కైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
