Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
గుమ్మడికాయ ముక్కల్ని ఆవిరిపై ఉడికించి ఇలా చేస్తే.. చికెన్, మటన్ కూడా పనికిరావు!
సాధారణంగా పసుపు గుమ్మడికాయ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది సాంబార్ లేదా పులుసు. కొంతమంది తీపి కూర లేదా వేపుడు కూడా చేసుకుంటారు. అయితే ఈసారి సరికొత్తగా పసుపు గుమ్మడికాయ గ్రేవీ ట్రై చేయండి. ఈ కూరను చపాతీ, రోటీ లేదా పుల్కాల్లోకి తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పసుపు గుమ్మడికాయ ముక్కలు- 250 గ్రాములు
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - అర టీస్పూన్
శనగపిండి - 3 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 3
టమోటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10
కారం - 2 టేబుల్ స్పూన్లు
కాశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2 ముక్కలు
ఏలకులు - 2
లవంగాలు - 4
బిర్యానీ ఆకు
జీలకర్ర - అర టీస్పూన్
కసూరి మెంతి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా గుమ్మడికాయ పైన ఉండే తొక్కను తీసివేసి శుభ్రం చేసుకోవాలి.
-మిక్సీ జార్ లో గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో శనగపిండి వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఒక ప్లేట్ కి లేదా ఇడ్లీ రేకులకు నూనె రాసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అందులో సమానంగా పరచాలి. దీనిని ఆవిరి మీద (ఇడ్లీ పాత్రలో) సుమారు 10-15 నిమిషాల పాటు ఉడికించాలి.
-చల్లారిన తర్వాత వీటిని పన్నీర్ ముక్కల్లా చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి వేయించాలి. అవి కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
-తర్వాత ఇందులో జీలకర్ర, జీడిపప్పు, కారం, కాశ్మీరీ కారం వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి గ్రేవీలా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు అదే బాండీలో మరో 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించాలి.
-మసాలా వేగిన తర్వాత, గ్రేవీకి సరిపడా నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు కసూరి మెంతిని నలిపి వేయాలి.
-చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను గ్రేవీలో వేసి మెల్లగా కలపాలి. మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications