Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పచ్చి కొబ్బరితో ఇలా దోశలు వేస్తే..ఇంటిల్లపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!
ఇడ్లీ, వడ, మసాలా దోశలు మనకు నిత్యం అలవాటైనవే. అయితే రుచిలోనూ, మెత్తదనంలోనూ వీటన్నింటికీ భిన్నంగా, అత్యంత కమ్మగా ఉండే బ్రేక్ ఫాస్ట్ కొబ్బరి దోశ. కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో దీనిని ఎక్కువగా చేసుకుంటారు. పచ్చి కొబ్బరితో చేయడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన తీపి వాసన, మృదువైన ఆకృతి వస్తాయి.
కొబ్బరి దోశ సాధారణ దోశల్లాగా కరకరలాడుతూ ఉండదు. ఇది దూదిలా మెత్తగా,నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. కొబ్బరి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బియ్యం: 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము: 1 కప్పు
అటుకులు: అర కప్పు
మెంతులు: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: దోశ కాల్చడానికి సరిపడా
నీళ్లు: పిండి రుబ్బడానికి తగినంత
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యాన్ని, 1 టీస్పూన్ మెంతులను వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి.
-అటుకులను గ్రైండ్ చేయడానికి ఒక 15 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది.
-నానబెట్టిన బియ్యం, మెంతులు, నానబెట్టిన అటుకులు, పచ్చి కొబ్బరి తురుమును మిక్సీ జార్ లో లేదా గ్రైండర్ లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చాలా మెత్తగా రుబ్బుకోవాలి.
-రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి సుమారు 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియబెట్టాలి.
-మరుసటి రోజు ఉదయం పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండి జారుగా ఉండేలా చూసుకోవాలి.
-స్టవ్ వెలిగించి దోశ పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడయ్యాక ఒక గరిటెడు పిండిని తీసుకుని పాన్ మధ్యలో వేయాలి. దీనిని సాధారణ దోశలాగా పల్చగా రుద్దకూడదు. కొంచెం మందంగా ఉంచాలి. దోశ చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. వెంటనే మూత పెట్టాలి.
-కొబ్బరి దోశను సాధారణంగా ఒక వైపు మాత్రమే కాలుస్తారు. మూత పెట్టడం వల్ల ఆవిరితో పైభాగం కూడా ఉడుకుతుంది. దోశపై చిన్న చిన్న రంధ్రాలు వస్తాయి. ఇది దోశ మెత్తగా వచ్చిందనడానికి నిదర్శనం.
-క్రింది భాగం లేత బంగారు రంగులోకి వచ్చాక తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి. దీనిలోకి కారంగా ఉండే అల్లం చట్నీ, టమాటో చట్నీ లేదా చికెన్ పులుసు చాలా బాగుంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












