Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్.. అప్పటికప్పుడు వేసుకునే కరకరలాడే మొక్కజొన్న దోశ
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ అవే పూరీలు,బోండాలు, ఉప్మా, దోశలు, ఇడ్లీలు తింటే ఎవరికైనా బోర్ కొట్టడం సహజం. పొద్దున పూట హడావిడిలో కొత్తగా, కడుపుకు తేలికగా, త్వరగా పూర్తయ్యే రుచికరమైన అల్పాహారం ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుందా? అయితే మీకు కార్న్ దోశ పర్ఫెక్ట్ ఛాయిస్.
మొక్కజొన్న రొట్టెలు, ఉడకబెట్టిన కంకులు ఎప్పటినుంచో మన ఆహారంలో భాగమే. కానీ అదే మొక్కజొన్నతో తయారు చేసే దోశ మీ బ్రేక్ ఫాస్ట్ కు సరికొత్త రుచిని అందిస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే, అతి తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్.

కార్న్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు
తాజా మొక్కజొన్న గింజలు - 1 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
తురిమిన అల్లం - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 1
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - కాల్చడానికి సరిపడా
కార్న్ దోశ తయారీ విధానం
-ముందుగా మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తురిమిన అల్లం, పసుపు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు, కానీ మరీ పల్చగా నీళ్లలా కాకుండా చూసుకోండి.
-స్టవ్ వెలిగించి పెనం వేడి చేసి, కొద్దిగా నూనె రాయాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకుని పెనంపై గుండ్రంగా, కాస్త మందంగా పరుచుకోవాలి. మంటను మీడియంలో ఉంచి, ఒకవైపు బంగారు రంగులోకి మారి కరకరలాడుతూ కాలిన తర్వాత, మెల్లగా రెండో వైపుకు తిప్పి బాగా కాల్చుకోవాలి.
-అంతే నోరూరించే కార్న్ దోశ రెడీ
మరింత రుచి కోసం చిట్కాలు
మీ దోశ మరింత పోషకభరితంగా ఉండాలంటే తురిమిన క్యారెట్ లేదా సన్నగా తరిగిన క్యాప్సికం కూడా కలుపుకోవచ్చు. మరింత కరకరలాడుతూ రావాలంటే పిండిలో ఒక చెంచా బొంబాయి రవ్వ కలపండి.
కార్న్ దోశ ఎందుకంత ఆరోగ్యకరం?
మొక్కజొన్నలో ఫైబర్ (పీచుపదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది త్వరగా ఆకలి
వేయకుండా చూస్తూ, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో వాడే
శనగపిండి ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. బరువు
తగ్గాలనుకునే వారికి, తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన ఆహారం
తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications