Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మీ టిఫిన్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే కర్ణాటక ఫేమస్ తుమకూరు చట్నీ..ఎలా చేసుకోవాలంటే
పొద్దున్నే మన ఇళ్లలో వినిపించే ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏంటి? దానికి సమాధానంగా వేడివేడి ఇడ్లీలో, కరకరలాడే దోసెలో సిద్ధమవుతాయి. కానీ అసలైన సవాలు వాటితో పాటు ఏ చట్నీ చేయాలో నిర్ణయించుకోవడమే. రోజూ అదే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ తిని విసుగెత్తిపోయారా?
అయితే కర్ణాటక ఫేమస్ తుమకూరు చట్నీ ట్రై చేయాల్సిందే. చూడటానికి పచ్చని రంగులో మెరిసిపోతూ, పుదీనా చట్నీలా అనిపించినా దీని రుచి మాత్రం మాటల్లో వర్ణించలేనిది. ఒక్కసారి మీరు దీనిని రుచి చూశారంటే, మీ ఇంట్లో ఇది కచ్చితంగా ఫేవరెట్ చట్నీల జాబితాలో చేరిపోతుంది. తుమకూరు చట్నీ మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నూనె - 1 టీస్పూన్
మినప్పప్పు - 3 టేబుల్ స్పూన్లు
సాంబార్ ఉల్లిపాయలు- 15
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - 1 చిన్న ముక్క
ఎండుమిర్చి - 1
పచ్చిమిర్చి - 3
పుదీనా ఆకులు - ఒక గుప్పెడు
కొత్తిమీర - ఒక గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము - అర చిప్ప
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - రుబ్బుకోవడానికి సరిపడా
తాళింపు కోసం:
నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేసి వేడిచేయండి. నూనె కాస్త వేడెక్కాక అందులో మినపప్పు వేసి చిన్న మంట మీద బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించుకోండి. తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించాలి.
-తర్వాత అందులో శుభ్రంగా కడిగిన పుదీనా, కొత్తిమీర ఆకులను వేసి, ఆకులు వాడిపోయే వరకు ఒక్క నిమిషం పాటు వేయించండి.
-చివరగా పచ్చి కొబ్బరి తురుము, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి, ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో చల్లారిన మిశ్రమం, ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు వేసి, కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
-రుబ్బుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇక తాళింపు కోసం ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు వేసి ఆ ఘుమఘుమలాడే తాళింపును చట్నీపై వేసి కలపండి. అంతే నోరూరించే, రుచిలో అమోఘమైన కర్ణాటక ప్రసిద్ధ తుమకూరు చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications