Latest Updates
-
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
పిల్లలు బరువు పెరగడానికి, ఎముకలు దృఢంగా మారడానికి టేస్టీ నువ్వుల పొడి అన్నం..ఈజీగా ఎలా చేయాలంటే..
పిల్లలకు అన్నం తినిపించడం అనేది ప్రతి తల్లికీ ఒక పెద్ద సవాలు. వాళ్లకు ఏది వండి పెట్టినా రెండు ముద్దలు తిని వదిలేస్తుంటారు. దీనివల్ల వయసుకు తగ్గ బరువు ఉండటం లేదని, వారి శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందేమోనని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లల లంచ్ బాక్స్ లు రోజూ తిరిగి వస్తుంటే అమ్మల బాధ అంతా ఇంతా కాదు.

అలాంటికి వారికి నువ్వుల పొడి అన్నం రుచి చూపిస్తే మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ఇది లంచ్ బాక్స్ లోకి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నువ్వులు పోషకాల గని. వీటిలో క్యాల్షియం, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల దృఢత్వానికి, బరువు పెరగడానికి అద్భుతంగా సహాయపడతాయి. పిల్లలు ఇష్టంగా తినేలా, కమ్మటి వాసనతో నోరూరించే నువ్వుల పొడి అన్నం ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
నువ్వుల పొడి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - పావు కప్పు (తెల్లవి లేదా నల్లవి)
మినప పప్పు - పావు కప్పు
వేరుశెనగ గుళ్లు (పల్లీలు) - పావు కప్పు
ఎండు మిరపకాయలు - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
బియ్యం - 1 కప్పు (లేదా ఉడికించిన అన్నం)
నువ్వుల నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
మినప పప్పు - పావు టీస్పూన్
జీడిపప్పు - కొద్దిగా
పల్లీలు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 1 రెమ్మ

నువ్వుల పొడి అన్నం తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, ఒక చుక్క నూనె వేసి పొడిపొడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే అన్నం అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది.
-స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టి వేడి చేయండి. అందులో మినప పప్పు వేసి, సన్నని మంట మీద మాడిపోకుండా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే బాండీలో వేరుశెనగలు, ఎండు మిరపకాయలు కూడా వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ముందుగా కడిగి, ఆరబెట్టుకున్న నువ్వులను బాండీలో వేయండి. నువ్వులు చిటపటలాడుతూ, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. చివరగా కరివేపాకును కూడా తడి లేకుండా వేయించుకోండి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి, తగినంత ఉప్పు కలిపి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడిని డబ్బాలో నిల్వ కూడా చేసుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి, ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల నూనె లేదా నెయ్యి వేడి చేయండి. అందులో ఆవాలు, మినపపప్పు, పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయించండి. చివరగా కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడిని తాలింపులో వేసి కేవలం రెండు నిమిషాలు సన్నని మంట మీద కలపండి.
-చివరగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి, అన్నం మెతుకులు విరగకుండా సున్నితంగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, పోషకభరితమైన నువ్వుల పొడి అన్నం రెడీ. ఈ అన్నాన్ని పిల్లలకు వేడి వేడిగా వడ్డిస్తే, ఒక్క మెతుకు కూడా వదలకుండా లాగించేస్తారు. వారానికి రెండు సార్లు ఇలా చేసి పెడితే పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగడం మీరే గమనిస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
