Latest Updates
-
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి మెరుపునిచ్చే తులసి తమలపాకు రసం..ఎలా చేసుకోవాలంటే.. -
మెగ్నీషియం లోపం వేధిస్తోందా? కండరాల నొప్పులు, అలసట తగ్గించే 5 ఫుడ్స్ ఇవే! -
కార్తీకమాసం స్పెషల్.. ఘుమఘుమలాడే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లోనే చేసుకోండిలా..
Carrot Milkshake: హాట్ సమ్మర్ లో కూల్..కూల్ గా క్యారెట్ మిల్క్ షేక్ తో మజా చేసేద్దాం
Carrot Milkshake: వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇలాంటి వేసవి వేడికి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. మీ పిల్లలు పండ్లు లేదా కూరగాయలు తినడానికి ఇష్టపడితే, వారికి మిల్క్ షేక్ మంచి ఎంపిక. ఈ రోజు మనం క్యారెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
క్యారెట్ మిల్క్ షేక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటి వరకు, మీరు క్యారెట్లను పచ్చిగా లేదా జ్యూస్‌లో మాత్రమే తీసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా దానితో మిల్క్ షేక్ తయారు చేసారా? ఈ క్యారెట్ మిల్క్‌షేక్ నిజంగా పిల్లలకు ఇష్టమైనది. మరియు ఆరోగ్యంగా కూడా.

క్యారెట్ మిల్క్ షేక్ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. క్యారెట్ కంటి చూపును మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా, మొత్తం శరీరానికి పోషణను అందించే అనేక విటమిన్లను కలిగి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన క్యారెట్ మిల్క్ షేక్ రిసిపి భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలకు క్యారెట్ యొక్క పూర్తి ప్రయోజనాలను అందించాలనుకుంటే, వారికి ఖచ్చితంగా క్యారెట్ మిల్క్ షేక్ చేయండి. సరే, ఇప్పుడు ఆ క్యారెట్ మిల్క్ షేక్ ను సింపుల్ గా ఎలా తయారు చేయాలో చూద్దాం. చదివి రుచి చూసి ఎలా ఉందో మాతో పంచుకోండి.
కావాల్సిన పదార్థాలు:
తరిగిన క్యారెట్ - 3/4 కప్పు
బాదం - 16
పాలు - 2 కప్పులు
యాలకుల పొడి - 2 చిటికెడు
నాచురల్ స్వీట్నెర్ లేదా పంచదార - 1 టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం
ముందుగా బాదంపప్పును నీళ్లలో 4 గంటలు నానబెట్టి, తర్వాత దాని పై తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగేటప్పుడు పంచదార వేసి మీడియం మంట మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
తర్వాత అందులో క్యారెట్, బాదం, యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారనివ్వాలి.
తర్వాత మిక్సీలో పాలలోని పదార్థాలను వేసి కొద్దిగా పాలు పోసి బాగా రుబ్బుకోవాలి.
చివర్లో మిగిలిన పాలు వేసి ఒక్కసారి బీట్ చేసి సర్వ్ చేస్తే క్యారెట్ మిల్క్ షేక్ రెడీ!!!
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
