Latest Updates
-
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.!
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా..
వర్షాకాలం, చాతుర్మాస్య దీక్షల సమయంలో చాలా ఇళ్లలో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకాన్ని పూర్తిగా మానేస్తారు. ఇవి లేకుండా చేసే వంటలు చాలా చప్పగా, రుచి లేకుండా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. కేవలం పండుగల సమయంలోనే కాకుండా, నిత్యం సాత్విక లేదా జైన ఆహారం తీసుకునేవారు కూడా ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. మరి వీరు తినే ఆహారం రుచికరంగా ఉండాలంటే ఎలా?
మీ చప్పటి భోజనానికి అద్భుతమైన రుచిని జోడించే ఒక మ్యాజిక్ మసాలా రెసిపీని సోషల్ మీడియాలో ఒక ప్రముఖ ఫుడ్ క్రియేటర్ షేర్ చేశారు. ఈ ఆల్ రౌండర్ మసాలాను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని కూరల్లోనే కాకుండా అన్నం, పరాటా, స్నాక్స్.. ఇలా దేనిలోనైనా వాడుకోవచ్చు.

ఆల్ రౌండర్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు
కరివేపాకు - పెద్ద గుప్పెడు
పల్లీలు (వేరుశెనగలు) - కొద్దిగా
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - తగినన్ని
ఎండు కొబ్బరి పొడి లేదా తురుము - కొద్దిగా
ధనియాలు, జీలకర్ర - సమాన పరిమాణంలో
ఇంగువ - చిటికెడు
చాట్ మసాలా - కొద్దిగా
నిమ్మరసం - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!
ఆల్ రౌండర్ మసాలా తయారీ విధానం
-ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి.
-ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి, నూనె వేయకుండా కరివేపాకును కరకరలాడే వరకు సన్నని మంటపై డ్రై రోస్ట్ (పొడిగా వేయించి) చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే కడాయిలో వేరుశెనగలు, కశ్మీరీ ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర వేసి సన్నని మంటపై 2 నిమిషాల పాటు వేయించాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
-వేయించిన ఈ పదార్థాలన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. అన్నింటినీ మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.
-అంతే.. ఎంతో సువాసన వెదజల్లే ఆల్ రౌండర్ మసాలా రెడీ. ఈ పొడిని గాలి చొరబడని, పూర్తిగా పొడిగా ఉండే ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఎలా వాడుకోవచ్చు?
ఈ మసాలా ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. మీరు చేసే ఉల్లి, వెల్లుల్లి లేని
కూరల్లో లేదా గ్రేవీలలో కొద్దిగా ఈ మసాలా చల్లితే కూర రుచి, వాసన
అమాంతం పెరిగిపోతాయి. పరాటా లేదా పూరీ పిండి కలుపుకునేటప్పుడు
కొద్దిగా వేసుకోవచ్చు. వేడి అన్నం లేదా కిచిడీలో కొద్దిగా నెయ్యి, ఈ
మసాలా కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
శాండ్విచ్లు, ఖాఖ్రా లాంటి సాయంత్రం
స్నాక్స్ పై చల్లుకుంటే మంచి కారంగా, రుచిగా
అనిపిస్తుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
