Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
చికెన్ కందిపప్పు ఎప్పుడైనా తిన్నారా,ఇలా చేసుకునే తింటే పప్పునే మర్చిపోతారు.. రుచి అత్యద్భుతం
మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల పప్పులు తిని ఉంటారు. అలాగే ఎన్నో రకాల చికెన్ వంటకాలు కూడా తిని ఉంటారు. చికెన్, పప్పు అంటే ఇష్టం ఉందని తెలుగు వాడు ఉండడంటే నమ్మశక్యం కాదు. కానీ మీరెప్పుడైనా చికెన్ పప్పు తిన్నారా? మన పూర్వికులు గతంలో దీనిని ఎక్కువగా చేసుకుని తినేవారట. దీనిని చేసుకోవడం చాలా సులభం. రుచి మాత్రం మీరు ఊహించినదానికంటే అద్భుతంగా ఉంటుంది. ఈ చికెన్ పప్పును ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చికెన్ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక కప్పు కందిపప్పు
అరకిలో చికెన్
అర టీస్పూన్ ఆవాలు
అరటీస్పూన్ జీలకర్ర
రెండు ఉల్లిపాయలు
ఒక పెద్ద టమాటో
50ml నూనె
మూడు పచ్చిమిర్చి
కరివేపాకు
ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
రెండు టీస్పూన్ల కారం
రుచికి సరిపడా ఉప్పు
అర టీస్పూన్ పసుపు
ఒక టీస్పూన్ ధనియాల పొడి
అర టీస్పూన్ జీలకర్ర పొడి
పావు టీస్పూన్ గరం మసాలా
కొత్తిమీర
ఒక కప్పు నీరు
చికెన్ పప్పు తయారీ విధానం
ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 50ml నూనె పోసుకోవాలి. ఆ తరువాత అందులో అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటా అవుతుండగా సన్నగా తురుముకున్న ఉల్లియాపాయ ముక్కలను వేసుకోవాలి. వాటితో పాటు చీల్చి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి.
ఆ తరువాత అందులో ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో అరకిలో చికెన్ వేసుకొని ఆ చికెన్ నీళ్లు వదిలేసేంత వరకు కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తరువాత సన్నగా కట్ చేసుకున్న టమాటోలు, రెండు టీస్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, పావు టీస్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తరువాత ఆ మసాలా మొత్తం చికెన్‌కు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తరువాత చికెన్‌లోని నూనె పైకి తెర్లిన తరువాత అందులో ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు నీరు కూడా వేసుకోవాలి. మొత్తం ఓసారి కలుపుకోవాలి. అనంతరం వాటిని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని అందులో కొత్తిమీర చల్లుకుని దించుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ, టేస్టీ చికెన్ పప్పు సిద్ధమైనట్లే. దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే జీవితంలో మళ్ళీ పప్పు జోలికి వెళ్ళరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
