ఉల్లిపాయలతో చికెన్‌ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్‌ కూడా వదలకుండా తినేస్తారు.!

నాన్‌వెజ్‌ వంటకాల్లో చికెన్‌ వండటం చాలా ఈజీ, అంతేకాకుండా అందులో ఎన్నో వెరైటీలు. అయితే ఎన్ని వెరైటీలు ఉన్నా చికెన్‌ గ్రేవీ, చిక్కగా ఉంటేనే తింటున్నప్పుడు వచ్చే మజా వేరు. కానీ ఒక్కోసారి ఎంత ట్రే చేసినా గ్రేవీ సరిగా కుదరదు. దీంతో అన్నంలో కలుపుకోవడానికి సరిపోదు. కానీ ఈ పద్ధతిలో చికెన్‌ ఇగురు చేశారంటే లొట్టలేసుకుంటూ తింటారు. వండేటప్పుడు ఉల్లిపాయలు కరెక్ట్‌గా వేశారంటే ఆ రుచికి మైమరిచిపోతారు.

Chicken iguru with onions juicy and tasty recipe perfect for lunch and dinner

ఉల్లిపాయలతో చికెన్‌ ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్‌- అరకేజీ
ఉల్లిపాయలు- మూడు(మీడియం సైజు)
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
షాజీరా- పావు టీస్పూన్‌
మసాలా దినుసులు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్లు
పసుపు- అర టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చిమిర్చి- నాలుగు
పుదీనా ఆకులు- గుప్పెడు
జీడిపప్పు- రెండు టేబుల్‌ స్పూన్లు
కరివేపాకు- రెండు రెబ్బలు
కారం- రెండున్నర టీస్పూన్లు
టమాటా- ఒకటి
ధనియాల పొడి- రెండు టీస్పూన్లు
కొత్తిమీర- గుప్పెడు

ఉల్లిపాయలతో చికెన్‌ ఇగురు తయారీ విధానం

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని పెట్టుకోవాలి.

స్టవ్‌పైన కడాయి లేదా పాన్‌ పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక షాజీగా, బిర్యానీ ఆకు, జాపత్రి, ఏలకులు, లవంగాలు వేసి వేగనివ్వాలి.

ఇప్పుడు ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత చికెన్‌ వేసి కలిపి మూత పెట్టండి.

Chicken iguru with onions juicy and tasty recipe perfect for lunch and dinner

చికెన్‌లో నీరంతా పోయి ఉడుకుతున్నప్పుడు గ్లాసు నీళ్లు పోసి కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించాలి. మధ్యలో మూత తీసి చికెన్‌ ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత బిర్యానీ ఆకులు తీసివేయాలి. పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, జీడిపప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.

కాసేపటి తర్వాత టమాటాలను గుండ్రంగా పలుచగా కట్‌ చేసి కూరలో అక్కడక్కడా వేసి మూత పెట్టుకోవాలి. చిన్న మంటపైన ఉడికించాలి.

నూనె పైకి తేలిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. టేస్టీ అండ్‌ స్పైసీ చికెన్‌ ఇగురు రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 30, 2026, 16:13 [IST]
Desktop Bottom Promotion