For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas Special : శిల్పా శెట్టి హెల్దీ క్రిస్మస్ కేక్ ఎలా తయారు చేసిందో చూడండి...

క్రిస్మస్ పండుగ సందర్భంగా హెల్దీ ఫ్రూట్ కేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

Posted By:
|

మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా బయటి నుండి కేకులను, స్వీట్లను తెచ్చుకుని తినడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఇలాంటి సమయంలో మీరు ప్రత్యేకమైన వంటకాలు చేయాలని భావిస్తారు. ఎందుకంటే మీరు మొత్తం కుటుంబంతో కలిసి సరదాగా చేసుకునే వేడుక ఇది. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ వస్తుందనగానే మనలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.

క్రీస్తు పుట్టినరోజునే కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకోవడమనేది చాలా సర్వసాధారణం. ఇప్పటివరకు మీరు వివిధ రకాల కేకులను రుచి చూసిండొచ్చు. అయితే ఈ సంవత్సరం మీరు హెల్త్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తే.. ఫ్రూట్ కేకు తయారు చేయడం మంచిది. ఈ సందర్భంగా బాలీవుడ్ భామ, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి తయారు చేసిన ఫ్రూట్ కేక్ రెసిపీ ఎలా చేయాలో మేము మీతో షేర్ చేసుకుంటాం.

ఈ కేకు మీకు రుచికరంగానూ.. ఆరోగ్యకరంగానూ రెండు విధాలుగా కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ కేకు ఎలా తయారు చేయాలో ప్రారంభించేద్దాం రండి...

కావాల్సిన పదార్థాలు..

కావాల్సిన పదార్థాలు..

ఒక కప్పు గోధుమ పిండి

మూడు వంతులు కప్ సెమెలినా

ఒక టీ స్పూన్ అల్లం పొడి

ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి

ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా

ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్

ఒక కప్పు పెరుగు

ఒక కప్పు తేనే

100 గ్రాముల వంట నూనె

పండ్ల రసంలో ముంచిన మిశ్రమ పొడి (ఒక కప్పు)

రెసిపీ డెకరేషన్ కు తరిగిన బాదం మరియు అక్రోట్లు

ఒక కప్పు స్ట్రాబెర్రీ లేదా పండ్ల జామ్ కలపాలి

ఫ్రెష్ క్రీమ్ (అరకప్పు)

ఎవరైనా చేసుకోవచ్చు..

ఎవరైనా చేసుకోవచ్చు..

ఈ ఫ్రూట్ కేకు యొక్క ప్రత్యేకత ఏంటంటే..ఇది పూర్తిగా శాఖాహారమే. కాబట్టి దీన్ని ఎవరైనా తయారు చేసి క్రిస్మస్ వేడుకలుగా జరుపుకోవచ్చు.

తయారీ విధానం..

తయారీ విధానం..

ఈ కేకు తయారు చేయడానికి, మీరు మొదట ఒక జల్లెడ సహాయంతో పిండిని పెద్దగిన్నెలో వేసుకోవాలి. దీని తర్వాత సెమెలినా, అల్లం పొడి, దాల్చిన చెక్కపొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తర్వాత మీరు మరొక గిన్నె తీసుకుని దానికి పెరుగు జోడించండి. ఈ రెసిపీలో గుడ్డుకు బదులుగా పెరుగును వాడుతున్నారు. మీరు గుడ్డు కావాలనుకుంటే దాన్నే వాడొచ్చు.

బాగా కలపాలి..

బాగా కలపాలి..

ఇప్పుడే డేట్స్ సిరప్ మరియు వెజిటేబుల్ ఆయిల్ వేసి హ్యాండ్ బ్లెండర్ సహాయంతో బాగా కలపాలి. మీరు వంట నూనెకు బదులుగా వెన్నను కూడా వాడొచ్చు. కానీ వంటల నూనె వాడటం మీ ఆరోగ్యానికి మంచిది. దీని తర్వాత మీరు కొన్ని మిక్స్ గింజలను వేసి మరోసారి బాగా కలపాలి. ఈ గింజలను పండ్ల రసంలో ఉపయోగించే ముందు నానబెట్టి కొన్ని గంటల పాటు వదిలేయండి.

అందరి మన్ననలు పొందండి...

అందరి మన్ననలు పొందండి...

ఇది మీ కేక్ కు గింజలు మరియు పండ్ల మిశ్రమ రుచిని ఇస్తుంది. ఇప్పుడు దానికి డ్రై మిక్స్ పదార్థాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వంట నూనెతో బేకింగ్ ట్రేని కొంచెం గ్రీజు చేసి దానిపై కొంచెం పిండి వేయండి. మీరు ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి, తురిమిన బాదం మరియు జీడిపప్పు(కాజు)ను వేసి డెకరేట్ చేయండి. ఈ కేక్ కు అందమైన రూపం కూడా వస్తుంది. దీని కోసం మీరు ముందుగా 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ఓవెన్ ను ముందుగా వేడి చేసి, ఆ తర్వాత 40-45 నిమిషాల పాటు వేడి చేయాలి. కేక్ గ్యాస్ మీద ఉన్నప్పుడే దాని మీద ఫ్రెష్ క్రీమ్, జామ్ వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత ఓవెన్ నుండి కేకును జాగ్రత్తగా తీయాలి. అనంతరం అరగంట తర్వాత అంటే చల్లారక బేకింగ్ ట్రే నుండి తీసి ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ఆ ముక్కలను సర్వింగ్ ట్రేలో ఉంచి, జామ్ మరియు క్రీమ్ మిశ్రమాన్ని దానిపై ఉంచండి. ఇది మీ కేక్ యొక్కటేస్ట్ ను పెంచుతుంది.

చూశారు కదా.. హెల్దీ ఫ్రూట్ కేక్ తయారీ విధానం.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు కూడా మీ ఇంట్లో హెల్దీ, టేస్టీ ఫ్రూట్ కేక్ తయారు చేసి అందరి మన్ననలు పొందండి.

[ of 5 - Users]
English summary

Christmas Fruit Cake Recipe In Telugu

Here we talking about the Healthy Christmas fruit cake recipe in telugu. Read on
Desktop Bottom Promotion