రెగ్యులర్‌ టిఫిన్స్‌తో బోర్‌ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్‌ దాల్‌ పక్వాన్‌ ట్రై చేయాల్సిందే.!

డైలీ ఇడ్లీ, దోశ, పూరీ, వడ ఈ టిఫిన్లతో బోర్‌ కొట్టేసిందా.. లైఫ్‌లో అప్పుడప్పుడూ ఛేంజ్‌ కావాలనిపిస్తుంది. అధి ఫుడ్‌, ప్లేస్ ఏదైనా కావచ్చు. ఆ మార్పు దొరికితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అది హెల్త్‌కి కూడా అనుకూలంగా ఉండాలి. అప్పుడే ఆ ఛేంజ్‌కి అర్థం ఉంటుంది. ఆ ప్రయోగమేదో ముందుగా కిచెన్‌లో చేద్దాం. అదే దాల్‌ పక్వాన్‌. సిటీ కమ్యూనిటీస్‌లో ఎక్కువగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ జిహ్వకి కొత్త రుచితోపాటు పొట్టకి సంతృప్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి అలాంటి దాల్‌ పక్వాన్‌ని ఎలా తయారుచేయాలో చూద్దాం.

City community style dal pakwan recipe for healthy breakfast instead of regular tiffins

సిటీ కమ్యూనిటీ స్టైల్‌ దాల్‌ పక్వాన్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి శనగపప్పు- కప్పు
నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా
నీళ్లు- అరకప్పు
వాము- అర టీస్పూన్‌
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
గోధుమ పిండి- అర కప్పు
మైదా పిండి- కప్పు

ఆమ్‌చూర్‌ పొడి- అర టీస్పూన్‌
వేయించిన జీలకర్ర పొడి- అర టీస్పూన్‌
కారం- టీస్పూన్‌
మిరియాల పొడి- పావు టీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా

నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్‌
కారం- అర టీస్పూన్‌

సిటీ కమ్యూనిటీ స్టైల్‌ దాల్‌ పక్వాన్‌ తయారీ విధానం

లక్నో ఫేమస్‌ వెజ్‌ ధమ్‌ బిర్యానీ.. హైదరాబాద్‌ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.!

ముందుగా పచ్చి శనగపప్పును గంటపాటు నానబెట్టుకుని కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు, నూనె వేసి ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

ఈ లోగా బౌల్‌లో అర కప్పు నీళ్లు పోసి అందులో నలిచిన వాము, నూనె, ఉప్పు వేసి కలిపి గోధుమ పిండి వేసి కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసి కలుపుకొంటూ చపాతీ పిండి ముద్దలా చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు నానబెట్టుకోండి.

City community style dal pakwan recipe for healthy breakfast instead of regular tiffins

ఇప్పుడు కుక్కర్‌ మూత తీసి ఉడికిన పప్పును గరిటెతో బాగా చిదమాలి. ఆమ్‌చూర్‌ పొడి, వేయించిన జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి స్టవ్‌పైన కాసేపు ఉడికించండి.

బ్యాచ్‌లర్స్‌ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!

చిన్న తాలింపు పాన్‌ పెట్టుకుని అందులో నూనె, నెయ్యి వేసి కాగిన తర్వాత జీలకర్ర, కారం వేసి పప్పులోకి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోండి.

ఇప్పుడు తడిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చపాతీల మాదిరిగా ఒత్తుకుని ఫోర్క్‌ సాయంతో హోల్స్‌ పెట్టుకోవాలి. స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని బాగా కాగిన తర్వాత మీడియం మంటపైన చపాతీలను క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకోవాలి.

వీటిపైన పప్పు కూర వేసుకుని తినేయడమే. టేస్టీ అండ్‌ హెల్తీ దాల్‌ పక్వాన్‌ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 21, 2026, 7:03 [IST]
Desktop Bottom Promotion