Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.!
బిర్యానీ ముందు పెడితే ఎవరైనా కాదంటారా.. అది వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా నోరూరిపోవడం పక్కా. సరిగ్గా చేయాలే కానీ వెజ్ ధమ్ బిర్యానీ రుచికి మరేది సాటి రాదు. ఇక, మన హైదరాబాద్ స్టైల్ అయితే మసాలా ఘాటు నషాళానికి అంటాల్సిందే. కానీ అంత మసాలా తినలేని వారు ఇలా లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ చేశారంటే మెతుకు కూడా వదలకుండా తింటారు. శాకాహార ప్రియుల కోసం వెజ్ ధమ్ బిర్యానీని ఇలా పర్ఫెక్ట్ ప్రాసెస్‌లో చేయండి. రుచికి ఇంటిల్లిపాదీ క్యూ కట్టాల్సిందే..

లక్నో స్టైల్ వెజ్ ధమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ధమ్ బిర్యానీలో కూరగాయలను ఇలా సిద్ధం చేసుకోండి..
మీగడ పెరుగు- అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
ఉప్పు- టీస్పూన్
కారం- అర టేబుల్ స్పూన్
షాజీరా- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
జాపత్రి- ఒకటి
నెయ్యి- టీస్పూన్
కుంకుమ పువ్వు- చిటికెడు
పుదీనా ఆకులు- కొద్దిగా
బంగాళాదుంప ముక్కలు- అర కప్పు
క్యారెట్ ముక్కలు- అర కప్పు
కాలీఫ్లవర్ ముక్కలు- అర కప్పు
బీన్స్ ముక్కలు- అర కప్పు
పావు కప్పు- పచ్చి బఠాణీ
ఫ్లేవర్ కోసం
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు- రెండు
నెయ్యి- నాలుగు టేబుల్ స్పూన్లు
అల్లం తరుగు- కొద్దిగా
పచ్చిమిర్చి- నాలుగు
చిక్కటి పాలు- అర కప్పు
రోజ్ వాటర్- టేబుల్
స్పూన్
ఖేవ్డా వాటర్- అర టీస్పూన్
కుంకుమ పువ్వు- పెద్ద చిటికెడు
ఆరెంజ్ ఫుడ్ కలర్- చిటికెడు
నీళ్లు- రెండు లీటర్లు
మసాలా దినుసులు
బాస్మతి రైస్- అరకేజీ
లక్నో స్టైల్ వెజ్ ధమ్ బిర్యానీ తయారీ విధానం
ముందుగా ఒక బౌల్లో మీగడ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, షాజీరా, ధనియాల పొడి, పసుపు, జాపత్రి, నెయ్యి, కుంకుమ పువ్వు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు బంగాళాదుంప, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠాణీ వేసి కలుపుకొని సిద్ధం చేసి పెట్టుకున్న మీగడ పెరుగు మిశ్రమంలో వేసి కలిపి అరగంట పాటు నానబెట్టుకోండి.

స్టవ్‌పైన బాణలి పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్లో వేసి వేయించుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత నానబెట్టిన బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ మిశ్రమాన్ని వేసి కొన్ని నీళ్లు పోసి 80 శాతం ఉడకనివ్వండి.
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల వేసి వేడయ్యాక అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. చిక్కటి పాలు, రోజ్ వాటర్ వేసి కలపాలి. ఖేవ్డా వాటర్, కుంకుమ పువ్వు, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలిపి కాసేపు ఉడికించి పక్కన పెట్టుకోండి.
స్టవ్‌పైన బాణలి పెట్టుకుని నీళ్లు పోసి మసాలా దినుసులు వేసి మరిగించి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసుకుని 80 శాతం ఉడకనివ్వండి. తర్వాత ఉడికించిన అన్నాన్ని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మందపాటి బాణలిని స్టవ్‌పైన పెట్టుకుని వేడయ్యాక నెయ్యి వేసి ఉడికించిన బంగాళాదుంప స్టఫ్ మిశ్రమం కొద్దిగా వేసి తర్వాత లేయర్ చొప్పున బాస్మతి రైస్ వేసుకుని పై నుంచి పాల మిశ్రమం కొద్దిగా చల్లుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ఫ్రై వేసుకోవాలి. ఇలా లేయర్స్ చొప్పున అన్నీ వేసుకుని టిష్యూ పేపర్స్‌తో సైడ్ నుంచి కవర్ చేసుకుని మూత పెట్టి చిన్న మంటపైన దాదాపు 10 లేదా 15 నిమిషాల పాటు ఉడికించండి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరో 20 నిమిషాల పాటు అలాగే ఉంచి సర్వ్ చేసుకోవడమే..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
