Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పెరుగుతో చేసే ఈ పులుసు తింటే.. అబ్బా నా సామిరంగా అనాల్సిందే!
భోజనం చేశాక చివర్లో పెరుగుతో ఓ ముద్ద తినకపోతే అసలు భోజనం చేసినట్టే ఉండదు. పెరుగు లేకపోతే పెరుగు పులుసు అయినా పర్వాలేదు కానీ పెరుగుతో చివరి ముద్ద తినాల్సిందే. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ పెరుగుతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో ఒక రకమైన వంట కొబ్బరితో పెరుగు పులుసు. కొబ్బరితో పెరుగు పులుసు ఎలా చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో దీనిని చేసుకోవాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరి పెరుగు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
- అర లీటర్ పెరుగు
- ఒక కప్పు తరిగిన కొబ్బరి
- నాలుగు లేదా అయిదు పచ్చిమిర్చి
- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
- అర టేబుల్ స్పూన్ పసుపు
- మూడు లేదా నాలుగు వెల్లుల్లి
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- రెండు ఎండు మిరపకాయలు
- కొద్దిగా ఆవాలు
- కరివేపాకు
- మెంతులు

కొబ్బరి పెరుగు పులుసు తయారీ విధానం
ముందుగా కొబ్బరి తురుముతో పాటు జీలకర్ర, వెల్లుల్లి, చిటికెడు పసుపు వేసుకొని.. ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకుంటున్న పులుసులో ఒక గ్లాస్ నీరు పోయాలి. ఆ నీరు బాగా మరిగి ఆవిరైపోయాక.. అందులో మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం, అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని, కిందకు దించుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిసేపు చల్లారాలి.
ఇప్పుడు అర లీటర్ పెరుగు తీసుకోవాలి. ఆలాగే అందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ పెరుగును ఒకసారి మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి.
ఆ తరువాత మనం ముందుగానే చేసి, చల్లార్చుకున్న కొబ్బరి పచ్చి పులుసులో పెరుగు మిశ్రమాన్ని కలుపుకోవాలి. పెరుగును కలిపేటప్పుడు పులుసు మరీ వేడిగా ఉండకూడదు, అలా అని చల్లగా కూడా ఉండకూడదు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగును కలుపుకోవాలి.
ఇప్పుడు తాలింపు కోసం.. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైని మనం ముందుగానే చేసిపెట్టుకున్న కొబ్బరి పెరుగు పులుసుపై పోసేస్తే.. ఎంతో రుచికరమైన కొబ్బరి పెరుగు పులుసు సిద్ధమైనట్లే. దీనిని అన్నంలో కలుపుకొని తింటే.. అబ్బా నా సామిరంగా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications