Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే!
సాయంత్రం అవగానే ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు మనకు చప్పున గుర్తొచ్చేది వేడివేడి పకోడీ. అయితే ఎప్పుడూ ఒకేలా శెనగపిండితో కాకుండా కాస్త వెరైటీగా, ఆరోగ్యకరంగా జొన్న పిండి పకోడీ ఎప్పుడైనా ట్రై చేశారా? జొన్న పిండితో చేసే పకోడీలు అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, కరకరలాడుతూ భలేగా ఉంటాయి. వీటిని ఉదయం పూట తినడం కంటే, సాయంత్రం వేళ టీ లేదా కాఫీ తాగుతూ ఫ్యామిలీతో కలిసి తింటే ఆ మజాయే వేరు. అంతేకాదండోయ్.. వేడి వేడి అన్నంలో నంజుకుని తింటే ప్లేట్ల కొద్దీ అన్నం లాగించేయడం ఖాయం. దీనికి తోడుగా కాస్త మామిడికాయ పచ్చడి గానీ, పల్లీల చట్నీ గానీ జతకలిస్తే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

జొన్నపిండి పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
జొన్న పిండి - రెండు కప్పులు
శెనగ పిండి - ఒక కప్పు
బియ్యపు పిండి - ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు - తగినన్ని
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
కారం - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
వంట సోడా (సోడా ఉప్పు) - చిటికెడు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
జొన్న పిండి పకోడీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో జొన్న పిండి, శెనగపిండి వేసి కలపాలి. పకోడీలు మరింత కరకరలాడుతూ రావడానికి ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని జతచేయాలి. మీకు ఇష్టమైతే కాస్త మొక్కజొన్న పిండిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర ఆకులను వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మీ రుచికి తగినంత కారం, సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి అన్నీ పిండికి పట్టేలా కలపాలి.
-ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పకోడీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. చివరగా పకోడీలు క్రిస్పీగా రావడం కోసం చిటికెడు వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి,డీప్ ఫ్రైకి సరిపడా నూనెతో కడాయిని పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకుని కొద్దికొద్దిగా నూనెలో పకోడీల్లా వేసుకోవాలి. ఈ పకోడీలను అటూ ఇటూ తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన జొన్న పిండి పకోడీలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
