Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఇంట్లోనే దాబా స్టైల్ పాలక్ కిచిడీ.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఫేవరెట్
మన భారతీయ వంటకాల్లో కిచిడీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చలికాలం మధ్యాహ్న వేళల్లో వేడి వేడి కిచిడీలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. మారుతున్న వాతావరణం, చలి గాలుల నుండి తట్టుకోవడానికి మన శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకే సాధారణ కిచిడీకి భిన్నంగా, ఆకుకూరల బలంతో పాలక్ కిచిడీ ట్రై చేయండి.
డైటింగ్ చేసేవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధం లాంటిది. పాలకూరలోని ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది, పప్పులో ఉండే ప్రోటీన్ కండరాలకు బలాన్నిస్తుంది, ఇక బియ్యం తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. నోరూరించే హోటల్ స్టైల్ పాలక్ కిచిడీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
పెసర పప్పు లేదా శనగ పప్పు- అర కప్పు
పాలకూర - 1 పెద్ద కట్ట
ఉల్లిపాయ - 1
టమోటా - 1
అల్లం - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 4
పచ్చిమిర్చి - 2 లేదా 3
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి- 1 టేబుల్ స్పూన్
ఇంగువ - చిటికెడు
ఎండు మిరపకాయలు - 2
నీరు - 3 కప్పులు
మసాలా దినుసులు: ధనియాల పొడి, గరం మసాలా
తయారీ విధానం
-ముందుగా బియ్యం, పప్పును శుభ్రంగా కడిగి 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.
-తర్వాత కుక్కర్ లో నానబెట్టిన బియ్యం, పప్పు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 3 కప్పుల నీరు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అన్నం మరీ గట్టిగా కాకుండా మెత్తగా ఉండేలా చూసుకోండి.
-తర్వాత పాలకూర ఆకులను శుభ్రం చేసి మరిగే నీటిలో కేవలం ఒక నిమిషం పాటు ఉంచండి వెంటనే ఆకులను తీసి చల్లటి ఐస్ వాటర్ లో వేయండి. ఇలా చేయడం వల్ల ఆకుకూర రంగు మారదు. తర్వాత పచ్చిమిర్చి, పాలకూర కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీలిలో నెయ్యి లేదా నూనె వేడి చేశాక ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ,సన్నగా తరిగిన వెల్లుల్లి, తురిమిన అల్లం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులో టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. రుచి కోసం కొద్దిగా కారం, ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు ఉడికించండి.
-చివరగా బాండీలో ఉడికించిన అన్నం-పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా వేడి నీరు పోసి, మూత పెట్టి సన్నని మంటపై మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి.
-అంతే వేడి వేడి, గుమగుమలాడే పాలక్ కిచిడీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












