Latest Updates
-
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు! -
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా.. -
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.! -
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.!
మోదీ, మెలోని క్రేజ్.. ఇంట్లోనే 10 నిమిషాల్లో మెలోడీ చాక్లెట్ ఎలా చేసుకోవాలంటే..!
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.. ఈ ఇద్దరి పేర్లు వినగానే నెటిజన్లకు వెంటనే గుర్తొచ్చే పదం మెలోడీ(Melodi). ఇటీవల ప్రధాని మోదీ తన ఐదు దేశాల పర్యటన ముగించుకుని చివరి అంచెగా ఇటలీ చేరుకున్నారు. రోమ్ లో ఇటలీ ప్రధాని మెలోని ఆయనకు ఘన స్వాగతం పలకగా, ఈ ఇద్దరు నాయకుల భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. అయితే దీనికి కొనసాగింపుగా ఇటలీ ప్రధాని మెలోని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న ఒక క్యూట్ వీడియో మరింత వైరల్ గా మారింది. అందులో ఆమె, ప్రధాని మోదీ తనకు బహుమతిగా ఇచ్చిన మెలోడీ(Melody) చాక్లెట్ ప్యాకెట్ చూపిస్తూ ఆయనకు సరదాగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ కావడంతో.. మళ్లీ మెలోడీ చాక్లెట్ పేరు మారుమోగిపోతోంది. ఈ ట్రెండ్ చూశాక మీకు కూడా మెలోడీ టాఫీలను ఆస్వాదించాలని ఉందా? అయితే మీరు వెంటనే షాప్ కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో, ఇంట్లోనే అత్యంత సులభంగా, మార్కెట్లో అమ్మే అసలైన మెలోడీ చాక్లెట్ల రుచితో వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
మెలోడీ చాక్లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు
గోరువెచ్చని పాలు - అర కప్పు
ఇన్ స్టంట్ కాఫీ పొడి - 4 టేబుల్ స్పూన్లు
వెన్న (బటర్) - 2 టేబుల్ స్పూన్లు
కండెన్స్డ్ మిల్క్ (చిక్కటి పాలు) - 380 గ్రాములు
బటర్ పేపర్ లేదా గోల్డెన్ ఫాయిల్ పేపర్
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
మెలోడీ చాక్లెట్స్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో అర కప్పు గోరువెచ్చని పాలు తీసుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఇన్ స్టంట్ కాఫీ పొడి వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా చేయడం వల్ల టాఫీకి మార్కెట్లో దొరికే అద్భుతమైన, ఘాటైన కాఫీ రుచి వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ లేదా పాన్ పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసి కరిగించండి. వెన్న కరిగాక 380 గ్రాముల కండెన్స్ డ్ మిల్క్ పోసి అడుగు అంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూనే ఉండండి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న కాఫీ-పాల ద్రావణాన్ని నెమ్మదిగా పోస్తూ కలపండి. పాలు పోస్తున్నప్పుడు ఆపకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టే ప్రమాదం ఉంది. కొద్ది నిమిషాల్లోనే ఈ మిశ్రమం చిక్కబడటం మీరు గమనిస్తారు.
-మిశ్రమం బాండీ అంచుల నుండి విడిపోతూ, చేతికి తీసుకుంటే చిన్న ఉండలాగా (బాల్ లాగా) చేయడానికి వీలుగా వచ్చినప్పుడు చాక్లెట్ మిశ్రమం సిద్ధమైనట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, అలా చేస్తే చాక్లెట్స్ రాళ్ళలా గట్టిగా మారిపోతాయి.
-మిశ్రమం కొద్దిగా చల్లారాక, చేతికి కొద్దిగా వెన్న రాసుకుని చిన్న చిన్న భాగాలుగా తీసుకుని.. అచ్చం షాపులో దొరికే చాక్లెట్ల ఆకారంలో గుండ్రంగా లేదా పొడవుగా చుట్టుకోండి.
-ఇలా ఆకర్షణీయంగా తయారు చేసుకున్న చాక్లెట్లను గోల్డెన్ ఫాయిల్ పేపర్ లో లేదా బటర్ పేపర్ లో అందంగా చుట్టండి.
-అంతే అచ్చం మార్కెట్లో కొన్నట్లే ఉండే, నోరూరించే హోమ్ మేడ్ మెలోడీ చాక్లెట్లు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications