Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మటన్ కీమా వడలు..ఎలా చేసుకోవాలంటే
సాయంత్రం వేళ వేడి వేడి ఛాయ్‌తో పాటు కరకరలాడే స్నాక్స్ తినాలని ఎవరికి మాత్రం ఉండదు? రోజూ తినే పప్పు వడలు, మసాలా వడలకు బదులుగా ఈసారి కాస్త కొత్తగా, మరింత రుచికరంగా ఉండే మటన్ కీమా వడలను ట్రై చూడండి. పేరు వినగానే నోరూరిపోతోంది కదా. మృదువైన కీమా, ఘాటైన మసాలాల కలయికతో పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఈ వడలు ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీలకు లేదా కుటుంబ సభ్యులతో గడిపే సాయంత్రాలకు ఇది ఒక అద్భుతమైన వంటకం. ఈ రుచికరమైన వడలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కీమా వడల తయారీకి కావలసిన పదార్థాలు
-మటన్ కీమా (మెత్తగా రుబ్బింది) - 200 గ్రాములు
-శెనగ పప్పు- 1/2 కప్పు
-శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
-సోంపు గింజలు - 2 స్పూన్లు
-జీలకర్ర - 1 స్పూన్
-అల్లం పేస్ట్ - 1 స్పూన్
-వెల్లుల్లి పేస్ట్ - 1/2 టేబుల్ స్పూన్
-ఉల్లిపాయ - 1
-కొత్తిమీర తరుగు - ఒక గుప్పెడు
-కరివేపాకు - ఒక గుప్పెడు
-గరం మసాలా - 1 టీస్పూన్
-కారం - రుచికి సరిపడా
-ఇంగువ - పావు టీస్పూన్
-ఉప్పు - రుచికి తగినంత
-వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం
-వంటను ప్రారంభించడానికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగ పప్పు, సోంపు గింజలు, జీలకర్ర వేయండి. శుభ్రంగా కడిగి పప్పు మునిగేలా నీళ్ళు పోసి సుమారు 45 నిమిషాల పాటు నానబెట్టండి. పప్పు బాగా నానితేనే వడలు రుచిగా వస్తాయి.
-నానిన పప్పులోని నీటిని పూర్తిగా వంపేసి ఒక మిక్సీ జార్ లో వేసి నీళ్ళు కలపకుండా బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా చూసుకోండి, అప్పుడే వడలు కరకరలాడతాయి.
-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో మటన్ కీమాను కూడా వేసి మెత్తటి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగ పప్పు మిశ్రమం, మటన్ కీమా ముద్ద, శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఈ పదార్థాలన్నీ కీమా మిశ్రమంలో బాగా కలిసేలా చేత్తో గట్టిగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, అరచేతిలో పెట్టుకొని కొద్దిగా చదునుగా వడల ఆకారంలో ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద ఒక లోతైన బాండీ పెట్టి అందులో నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి సిద్ధం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వదలాలి. రెండు వైపులా చక్కటి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు ఓపిగ్గా వేయించుకోవాలి.
-వేయించిన వడలను ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుంటే అదనపు నూనె పీల్చుకుంటుంది. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే మటన్ కీమా వడలు రెడీ. వీటిని వేడి వేడిగా టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే అబ్బా, ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications