Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..
గుమ్మడికాయతో చేసిన కూరలు, స్వీట్లు, లేదా వడియాలు మీరు చాలాసార్లు తినే ఉంటారు. కానీ ఎప్పుడైనా కరకరలాడే గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? వినడానికి కాస్త కొత్తగా అనిపించినా, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. కానీ కూర వండితే పిల్లలు తినడానికి మారాం చేస్తారు. అలాంటి వారికి ఇలా పూరీలు చేసి పెడితే, అందులో గుమ్మడికాయ ఉందనే విషయం కూడా తెలియకుండా ఇష్టంగా లాగించేస్తారు.

గుమ్మడికాయ పూరీ తయారీకి కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ ముక్కలు - 250 గ్రాములు
ఉడికించిన బంగాళదుంప - 1
పచ్చిమిర్చి - 4
బొంబాయి రవ్వ (సూజీ)- 6 టీస్పూన్లు
గోధుమ పిండి - సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
వాము - అర టీస్పూన్
కసూరి మేతి- కొద్దిగా
నీళ్లు - తగినంత
గుమ్మడికాయ పూరీ తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల గుమ్మడికాయను తీసుకుని, పైన ఉన్న గట్టి తొక్కను పూర్తిగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప, 4 పచ్చిమిరపకాయలు, 5-6 టీస్పూన్ల బొంబాయి రవ్వ వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి, ఎక్కడా ముక్కలు లేకుండా అత్యంత మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ పేస్ట్ ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి.
-అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కసూరి మేతి, చేతితో నలిపిన వాము, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో గోధుమ పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. గుమ్మడికాయ పేస్ట్ ఎంత ఉందో దాదాపు అంతే పరిమాణంలో పిండి పడుతుంది. పూరీ పిండిలా కాస్త గట్టిగా ముద్దలా పిసికి, మూతపెట్టి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ నాని పూరీలు కరకరలాడుతూ వస్తాయి.
-పది నిమిషాల తర్వాత పిండిని మళ్లీ ఒకసారి బాగా మర్దన చేయాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న పిండి నుండి చిన్న చిన్న ఉండలు తీసుకుని, మరీ పలచగా కాకుండా పూరీల్లా ఒత్తుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఒత్తి పెట్టుకున్న పూరీలను అందులో వేసి రెండు వైపులా తిప్పుతూ, లేత బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల ఇవి చక్కగా పొంగుతూ, క్రిస్పీగా వస్తాయి.
-అంతే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పూరీలు రెడీ. వీటిని మీకు నచ్చిన పచ్చడితో, మామిడికాయ ఊరగాయతో ఆస్వాదించవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ వెరైటీ పూరీలు చేసి పెడితే వారు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
