Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
తిన్న కొద్దీ తినాలనిపించే చిట్టి చెక్కలు..దీన్ని మించిన స్నాక్ ఉండదుగా..ఎలా చేసుకోవాలంటే
చిట్టి చెక్కలు, ఆంధ్రాలో చాలా ఇష్టపడే ఒక సంప్రదాయ స్నాక్. ఇవి సాయంత్రం వేళ టీతో పాటు తినడానికి బెస్ట్ స్నాక్. సాధారణంగా పండుగలప్పుడు లేదా ఇంట్లో స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు వీటిని ఎక్కువగా చేస్తుంటారు. ఇవి కరకరలాడుతూ,కారంగా, రుచిగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటాయి. ఇంట్లో తయారుచేసే చెక్కలలో ఎటువంటి కృత్రిమ రంగులు, రుచులు లేదా సంరక్షణకారులు ఉండవు. అన్ని పదార్థాలు సహజమైనవి కాబట్టి బయట కొనే ప్యాకేజ్డ్ స్నాక్స్ కంటే ఇవి ఆరోగ్యకరమైనవి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ చిట్టి చెక్కలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
చిట్టి చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యపు పిండి
-ఉప్పు
-నెయ్యి
-నువ్వులు
-కలోంజీ సీడ్స్
-ఆయిల్

చిట్టి చెక్కలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1కప్ప(250ml)నీళ్లు పోసి, ఇందులో కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ వెన్న లేదా నెయ్యి వేయండి.
-నీళ్లు వేడి అవుతున్న సమయంలో అందులో 1కప్ప(250ml)బియ్యపు పిండి వేయండి. బాగా కలిపి దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టుకోండి. బాగా ఉడకాల్సిన అవసరం లేదు.
-ఇప్పుడు పాన్ లోని చల్లారిన బియ్యం పిండి మిశ్రమంలో 1 టీస్పూన్ నువ్వులు, అర టీస్పూన్ కారం, 1 టీస్పూన్ కలోంజీ సీడ్స్ వేసి పిండి అంతా కలిసేలా చేతిలో బాగా కలపండి. మరీ మెత్తగా ఉండకూడదు,మరీ గట్టిగా ఉండకూడదు. సెమీ సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది.
-చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని కొంచెం కొంచెం అరచేతుల్లోకి తీసుకొని ఫ్లాట్ గా బిల్లలు మాదిరి వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చెక్కలను కొన్ని కొన్నిగా వేసుకోండి. వేశాక 1 నిమిషం పాటు తిప్పకుండా అలాగే ఉంచాలి. తర్వాత గరిటతో నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకుంటుండాలి.
-మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని బాండీలో నుంచి తీసుకోవాలి. అంతే చిట్టి చెక్కలు రెడీ.
-చిట్టి చెక్కలు ఒక రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు, వీటిలో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బియ్యప్పిండి ప్రధాన పదార్థం కావడం వల్ల, చిట్టి చెక్కలు తక్షణ శక్తిని అందిస్తాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి అలసటను దూరం చేసి, చురుకుదనాన్నిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications