Latest Updates
-
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి
నోటికి పండగలా అనిపించే దహీ సమోసా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సాయంత్రం అవుతుందంటే చాలు, మనందరి మనసు ఏదైనా కారంగా, రుచికరంగా తినాలని ఆరాటపడుతుంది. అందులోనూ వాతావరణం కాస్త చల్లగా ఉంటే, వేడివేడిగా, స్ట్రీట్ స్టైల్ చాట్ తినాలనే కోరిక మరింత పెరుగుతుంది. కానీ బయటకు వెళ్లేంత సమయం లేదా ఓపిక లేనప్పుడు ఇంట్లోనే త్వరగా,సులభంగా తయారు చేసుకునే అద్భుతమైన స్నాక్.. దహీ సమోసా చాట్.
కరకరలాడే వేడివేడి సమోసాలు, దానికి తోడుగా చల్లని, క్రీమీ పెరుగు, అలాగే తీపి, పులుపు, కారం కలగలిపిన చట్నీల అద్భుతమైన కలయికే ఈ దహీ సమోసా చాట్. ప్రతి బైట్ లోనూ మీకు ఆ పులుపు, తీపి, కారం రుచులు తగిలి నోటికి పండగలా అనిపిస్తుంది. దీనిని చేయడం చాలా సులభం, కేవలం నిమిషాల్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే బండి మీద దొరికే చాట్ రుచిని ఆస్వాదించవచ్చు.

దహీ సమోసా చాట్ తయారీకి కావలసిన పదార్థాలు
సమోసాలు - 2 లేదా 3
గట్టి పెరుగు - 1 కప్పు
చక్కెర - అర చెంచా
తీపి చింతపండు చట్నీ - 2 చెంచాలు
పుదీనా-కొత్తిమీర పచ్చి చట్నీ - 1 చెంచా
ఉల్లిపాయ - 1
టమాటో - 1
వేయించిన జీలకర్ర పొడి - అర చెంచా
కారం పొడి - అర చెంచా
చాట్ మసాలా - అర చెంచా
ఉప్పు - రుచికి సరిపడా
సన్న కారప్పూస - అలంకరణ కోసం
కొత్తిమీర - కొద్దిగా
దానిమ్మ గింజలు - గుప్పెడు
దహీ సమోసా చాట్ తయారీ విధానం
-ముందుగా సమోసాలను తీసుకుని వాటిని ఓవెన్ లేదా పాన్ మీద కొద్దిగా వేడి చేయండి. ఒక ప్లేట్ తీసుకుని, అందులో సమోసాలను చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి పెట్టుకోండి.
-సమోసాలు మరింత కరకరలాడుతూ ఉండాలంటే, వాటిని ముక్కలు చేసే ముందు నూనెలో లైట్ గా ఫ్రై లేదా ఎయిర్ ఫ్రైర్ లో కాస్త వేడి చేసుకోవచ్చు. ఇది చాట్ కి మంచి క్రంచీ నెస్ ఇస్తుంది.
-తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కాస్త పంచదార వేసి, ఎలాంటి ఉండలు లేకుండా క్రీమ్ లాగా గిలకొట్టండి. ఈ చల్లటి పెరుగును సమోసా ముక్కల పైభాగం అంతా కవర్ అయ్యేలా పోయండి.
-పెరుగు పైన తీపి చింతపండు చట్నీని, అలాగే కారంగా ఉండే పచ్చి చట్నీని కొద్దికొద్దిగా వేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలను పైన చల్లండి.
-అసలైన స్ట్రీట్ చాట్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి, కారం పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పును చాట్ పైన చిలకరించండి.
-చాట్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటానికి చివరగా సన్నటి కారప్పూస,కొత్తిమీర తురుము చల్లండి. దీనిపైన కొన్ని దానిమ్మ గింజలను కూడా జల్లితే దహీ సమోసా చాట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
