Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
నోటికి పండగలా అనిపించే దహీ సమోసా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సాయంత్రం అవుతుందంటే చాలు, మనందరి మనసు ఏదైనా కారంగా, రుచికరంగా తినాలని ఆరాటపడుతుంది. అందులోనూ వాతావరణం కాస్త చల్లగా ఉంటే, వేడివేడిగా, స్ట్రీట్ స్టైల్ చాట్ తినాలనే కోరిక మరింత పెరుగుతుంది. కానీ బయటకు వెళ్లేంత సమయం లేదా ఓపిక లేనప్పుడు ఇంట్లోనే త్వరగా,సులభంగా తయారు చేసుకునే అద్భుతమైన స్నాక్.. దహీ సమోసా చాట్.
కరకరలాడే వేడివేడి సమోసాలు, దానికి తోడుగా చల్లని, క్రీమీ పెరుగు, అలాగే తీపి, పులుపు, కారం కలగలిపిన చట్నీల అద్భుతమైన కలయికే ఈ దహీ సమోసా చాట్. ప్రతి బైట్ లోనూ మీకు ఆ పులుపు, తీపి, కారం రుచులు తగిలి నోటికి పండగలా అనిపిస్తుంది. దీనిని చేయడం చాలా సులభం, కేవలం నిమిషాల్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే బండి మీద దొరికే చాట్ రుచిని ఆస్వాదించవచ్చు.

దహీ సమోసా చాట్ తయారీకి కావలసిన పదార్థాలు
సమోసాలు - 2 లేదా 3
గట్టి పెరుగు - 1 కప్పు
చక్కెర - అర చెంచా
తీపి చింతపండు చట్నీ - 2 చెంచాలు
పుదీనా-కొత్తిమీర పచ్చి చట్నీ - 1 చెంచా
ఉల్లిపాయ - 1
టమాటో - 1
వేయించిన జీలకర్ర పొడి - అర చెంచా
కారం పొడి - అర చెంచా
చాట్ మసాలా - అర చెంచా
ఉప్పు - రుచికి సరిపడా
సన్న కారప్పూస - అలంకరణ కోసం
కొత్తిమీర - కొద్దిగా
దానిమ్మ గింజలు - గుప్పెడు
దహీ సమోసా చాట్ తయారీ విధానం
-ముందుగా సమోసాలను తీసుకుని వాటిని ఓవెన్ లేదా పాన్ మీద కొద్దిగా వేడి చేయండి. ఒక ప్లేట్ తీసుకుని, అందులో సమోసాలను చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి పెట్టుకోండి.
-సమోసాలు మరింత కరకరలాడుతూ ఉండాలంటే, వాటిని ముక్కలు చేసే ముందు నూనెలో లైట్ గా ఫ్రై లేదా ఎయిర్ ఫ్రైర్ లో కాస్త వేడి చేసుకోవచ్చు. ఇది చాట్ కి మంచి క్రంచీ నెస్ ఇస్తుంది.
-తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో కాస్త పంచదార వేసి, ఎలాంటి ఉండలు లేకుండా క్రీమ్ లాగా గిలకొట్టండి. ఈ చల్లటి పెరుగును సమోసా ముక్కల పైభాగం అంతా కవర్ అయ్యేలా పోయండి.
-పెరుగు పైన తీపి చింతపండు చట్నీని, అలాగే కారంగా ఉండే పచ్చి చట్నీని కొద్దికొద్దిగా వేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలను పైన చల్లండి.
-అసలైన స్ట్రీట్ చాట్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు వేయించిన జీలకర్ర పొడి, కారం పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పును చాట్ పైన చిలకరించండి.
-చాట్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటానికి చివరగా సన్నటి కారప్పూస,కొత్తిమీర తురుము చల్లండి. దీనిపైన కొన్ని దానిమ్మ గింజలను కూడా జల్లితే దహీ సమోసా చాట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications