క్రీస్పీగా,క్రంచీగా,గుల్లగా,టేస్టీగా..నెల రోజులు నిల్వ ఉండే హెల్దీ స్నాక్ రాగి చెక్కలు

Posted By:

చిరుధాన్యాలలో రారాజుగా పిలువబడే రాగిని ఉపయోగించి మనం ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. రాగి జావ, రాగి ముద్ద, రాగి రొట్టె, రాగి దోస ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. అయితే ఆరోగ్యం, రుచి రెండూ కలగలిసిన ఒక అద్భుతమైన స్నాక్ రాగి చెక్కలు. వీటినే రాగి అప్పాలు అని కూడా పిలుస్తారు.

ముఖ్యంగా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుండి రాగానే, అనారోగ్యకరమైన జంక్ ఫుడ్‌ కు బదులుగా ఇంట్లో తయారుచేసిన, పోషకాలు నిండిన ఈ రాగి చెక్కలను అందించడం వారి సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెల రోజుల వరకు నిల్వ ఉండే రుచికరమైన రాగి చెక్కలను ఇంట్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

crispy crunchy and tasty healthy snack ragi chekkalu recipe in telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగి పిండి
-బెల్లం
-గోధుమ పిండి
-నువ్వులు
-ఉప్పు
-ఎండు కొబ్బరి
-యాలకలు
-నెయ్యి
-నూనె

తయారీ విధానం

-ముందుగా మిక్సీ గిన్నెలో పావుకప్పు ఎండుకొబ్బరి ముక్కలు, 4 యాలకలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత ఒక పెద్ద ప్లైట్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు,పావు టీస్పూన్ ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి వేసి మొత్తం అన్నీ కలిసేలా స్పూన్ తో బాగా కలుపుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 కప్పు బెల్లం తురుము వేసి ఇందులోనే అరకప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద కలుపుతూ బెల్లంని కరగనిచ్చి స్టవ్ ఆపేయండి. పాకం రానవసరం లేదు.

-ఇప్పుడు కలిపి ఉంచిన రాగి పిండి మిశ్రమంలో కరిగిన బెల్లం నీళ్లను వడకట్టి పోసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. పిండిముద్దను మరీ గట్టిగా కాకుండా,మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి.

-కలుపుకున్న పిండిమీద మూత పెట్టి పావు గంట సేపు వదిలేస్తే పిండి నానుతుంది.

-15 నిమిషాల తర్వాత పిండి ముద్దలో నుంచి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని బటర్ పేపర్ మీద లేదా పాల ప్యాకెట్ కవర్ మీద అయినా కాస్త నెయ్యిని అప్లై చేసి పిండి ముద్ద పెట్టి చెక్కల్లా వత్తుకోవాలి. వత్తుకునేటప్పుడు చేతులకు కూడా నెయ్యి పూసుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి చెక్కలు వేయించడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేశాక మంటను మీడియంలో ఉంచి వత్తుకున్న చెక్కలను ఆయిల్ లో వేసి రెండువైపులా సమానంగా వేగాక బయటకు తీసుకోండి. అంతే రాగి చెక్కలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 29, 2025, 11:00 [IST]
Desktop Bottom Promotion