Latest Updates
-
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి!
సాయంత్రం చల్లని గాలికి వేడి వేడిగా టీ తాగుతుంటే.. దానికి తోడుగా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజాయే వేరు. అందులోనూ నాన్ వెజ్ ప్రియులకైతే ఫిష్ పకోడీ బెస్ట్ ఆప్షన్.
పైన కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఉండే ఫిష్ పకోడీలను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సూపర్ టేస్టీ స్నాక్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

ఫిష్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ముళ్లు లేని చేప ముక్కలు - 225 గ్రాములు
శనగపిండి - ⅓ కప్పు
బియ్యప్పిండి లేదా కార్న్‌ఫ్లోర్ - రెండున్నర టేబుల్
స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కారం- పావు టీస్పూన్
కాశ్మీరీ కారం - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - ముప్పావు టీస్పూన్
దంచిన వాము - అర టీస్పూన్
గుడ్డు తెల్లసొన - 1
కొత్తిమీర, పుదీనా, కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఫిష్ పకోడీ తయారీ విధానం
-ముందుగా చేప ముక్కల్లో ముళ్లు లేకుండా చూసుకుని, అంగుళం సైజులో (క్యూబ్స్ లాగా) కట్ చేసుకోవాలి.
-ఒక గిన్నెలో కట్ చేసిన ముక్కలు తీసుకుని.. అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా పట్టించాలి. వీటిని 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు అస్సలు నానబెట్టకూడదు. ఎక్కువసేపు ఉంచితే ముక్కలు బాగా మెత్తబడి ముద్దలా అయిపోతాయి.
-ఇప్పుడు ఆ ముక్కల్లో దంచిన వాము, గుడ్డు తెల్లసొన, కాశ్మీరీ కారం, గరం మసాలా, తరిగిన ఆకుకూరలు వేసి కలపాలి. ఆ తర్వాత శనగపిండి, బియ్యప్పిండి వేసి ముక్కలకు కోటింగ్ లా పట్టేలా కలుపుకోవాలి. పిండి పొడిపొడిగా అనిపిస్తేనే రెండు మూడు చెంచాల నీళ్లు చల్లాలి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిలో నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె కాగాక, చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. వేసిన వెంటనే గరిటెతో కదపకుండా, రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా తిప్పుతూ 4-5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మీడియం మంట మీద వేయించుకోవాలి.
-బాగా వేగిన పకోడీలను టిష్యూ పేపర్‌పైకి తీసుకోవాలి. అంతేనోరూరించే వేడివేడి ఫిష్ పకోడీలు రెడీ. వీటిని పుదీనా చట్నీతో గానీ, టొమాటో కెచప్‌తో గానీ నంజుకుని.. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసంతో తింటుంటే ఆ రుచి మనసును దోచేయడం ఖాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
