స్వీట్ షాప్ స్టైల్ పర్ఫెక్ట్ బీట్‌ రూట్ జిలేబీ.. ఈ సింపుల్ టిప్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

Posted By:

భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన సాంప్రదాయ స్వీట్లలో జిలేబీదే అగ్రస్థానం. వేడి వేడిగా, కరకరలాడుతూ పాకంలో ఊరిన జిలేబీని చూస్తేనే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. కానీ ఎప్పుడూ ఒకేలాంటి జలేబీలు కాకుండా కాస్త విభిన్నంగా, ఆరోగ్యకరంగా, ఆకర్షణీయంగా ఏదైనా స్వీట్ ప్రయత్నించాలనుకుంటే బీట్‌ రూట్ జిలేబీ మీకు బెస్ట్ ఆప్షన్.

ఎర్రటి రంగులో మెరిసిపోయే ఈ జిలేబీలు సాధారణ జిలేబీల కంటే రుచిలోనూ, అందంలోనూ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. వీటికి కమ్మని రబ్డీ తోడైతే ఆ రుచి వర్ణనాతీతం. బీట్‌ రూట్ జలేబీని సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Crispy Juicy Mouth Watering Beetroot Jalebi Recipe in Telugu

కావలసిన పదార్థాలు

జిలేబీ పిండి కోసం:

బీట్‌ రూట్ - 250 గ్రాములు
మైదా పిండి - 150 గ్రాములు
పొట్టులేని మినపప్పు - 100 గ్రాములు
శనగపిండి - 20 గ్రాములు
బేకింగ్ సోడా - 2 నుండి 3 గ్రాములు

పాకం,వేయించడానికి:

చక్కెర - 200 గ్రాములు
నెయ్యి - 300 గ్రాములు
నిమ్మకాయ - 1

కమ్మని రబ్డీ కోసం:
పాలు - 1 లీటరు
చక్కెర - 30 గ్రాములు
యాలకుల పొడి - చిటికెడు
కుంకుమపువ్వు రేకులు - 6 నుండి 7

కోయంబత్తూర్ స్పెషల్ టమాటా తన్నీ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే కాంబినేషన్!

తయారీ విధానం

-ముందుగా బీట్‌ రూట్‌ లను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడకబెట్టాలి. అవి చల్లారిన తర్వాత తొక్క తీసి, మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీలా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

-మరోవైపు మినపప్పును శుభ్రంగా కడిగి గంటపాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మైదా, శనగపిండి, రుబ్బి పెట్టుకున్న మినపప్పు పేస్ట్, బేకింగ్ సోడా, ముందుగా సిద్ధం చేసుకున్న బీట్‌ రూట్ ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. జిలేబీలు గుడ్డలో నుండి జారేందుకు వీలుగా తగినంత నీరు పోసి, పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి.

-ఒక గిన్నెలో 200 గ్రాముల చక్కెర, కొద్దిగా నీరు పోసి సన్నని మంటపై ఉడికించాలి. పాకం చిక్కబడుతున్నప్పుడు, అది తిరిగి గడ్డకట్టకుండా ఉండటానికి కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఇందులో సువాసన కోసం యాలకుల పొడి, రెండు మూడు కుంకుమపువ్వు రేకులు వేసి లేత తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

-ఇప్పుడు వెడల్పాటి బాండీలో స్వచ్ఛమైన నెయ్యి వేడి చేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని జిలేబీలు వేసే గుడ్డలో (లేదా పైపింగ్ బ్యాగ్‌ లో) వేసి, కాగుతున్న నెయ్యిలో గుండ్రంగా జిలేబీల్లా చుట్టాలి. సన్నని మంటపై రెండు వైపులా కరకరలాడే వరకు వేయించాలి. అవి వేగగానే వాటిని తీసి వెంటనే గోరువెచ్చని పంచదార పాకంలో వేసి ముంచాలి. తీపి బాగా పీల్చుకున్న తర్వాత వాటిని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.

-మందపాటి గిన్నెలో లీటరు పాలను తీసుకుని సన్నని మంటపై వేడి చేయాలి. అందులో మిగిలిన యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి.. పాలు సగానికి పైగా ఇగిరిపోయి చిక్కబడేవరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత 30 గ్రాముల పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఈ కమ్మని రబ్డీని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఎర్రగా నిగనిగలాడే బీట్‌ రూట్ జిలేబీలను ఒక అందమైన ప్లేట్‌ లో పేర్చి, వాటిపై చల్లని లేదా గోరువెచ్చని రబ్డీని వేసి వడ్డించండి.

[ of 5 - Users]
Story first published: Thursday, October 29, 2026, 11:33 [IST]
Desktop Bottom Promotion