Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కరకరలాడే పనీర్ 65..పైన క్రిస్పీ, లోపల జ్యూసీ..ఆహా అనాల్సిందే!
భోజన ప్రియులందరికీ 65 అనే పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది చికెన్ 65. నాన్ వెజ్ తినేవాళ్లకు చికెన్ స్టార్టర్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరకరలాడుతూ, కారంగా ఉండే ఆ రుచిని ఎవరు కాదంటారు? మరి మాంసాహారం తినని వారి మాటేమిటి?
చికెన్ 65కి ఏమాత్రం తీసిపోని రుచితో, ఇంకా చెప్పాలంటే అంతకంటే అద్భుతంగా ఉండే పనీర్ 65ను ఎప్పుడైనా రుచి చూశారా? పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ వంటకం స్టార్టర్ గానూ, లేదా భోజనంలో సైడ్ డిష్ గానూ అద్భుతంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు
పనీర్: 200 గ్రాములు
మొక్కజొన్న పిండి: 2 టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి: 2 టేబుల్ స్పూన్లు
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
కారం పొడి: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
కసూరి మేథి: 1 టీస్పూన్ (నలిపి వేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: కలపడానికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 4-5
అల్లం ముక్కలు: చిన్నగా తరిగినవి
పచ్చిమిర్చి: 2
ఎండుమిర్చి: 2
కరివేపాకు: 2 రెమ్మలు
కొత్తిమీర: గార్నిష్ కోసం
పనీర్ 65 తయారీ విధానం
-ముందుగా పనీర్ ను మీకు నచ్చిన సైజులో చతురస్రాకారపు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కసూరి మేథి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గట్టి పెరుగు వేసి కలపాలి. ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
-ఇప్పుడు పనీర్ ముక్కలను కలిపిన పిండి మిశ్రమంలో వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా నిదానంగా కలపాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక మంటను మీడియంలో ఉంచి మ్యారినేట్ చేసిన పనీర్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి.
-పనీర్ బంగారు రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. పనీర్ ను ఎక్కువ సేపు వేయిస్తే గట్టిగా రబ్బరులా మారుతుంది, కాబట్టి జాగ్రత్తగా వేయించాలి.
-ఇప్పుడు వేరొక పాన్ స్టవ్ మీద పెట్టి అందులో 2 స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఈ పోపు మంచి వాసన వస్తున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేయాలి.
-మంటను ఎక్కువలో ఉంచి పనీర్ ముక్కలకు ఈ పోపు రుచి అంతా పట్టేలా ఒకటి రెండు నిమిషాలు కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే వేడి వేడి, కరకరలాడే రుచికరమైన పనీర్ 65 రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications