Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
సాయంత్రం టీ టైమ్లో కరకరలాడే శనగపిండి కారప్పూస.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
సాయంత్రం వేడి వేడి టీ తాగుతుంటే దానికి తోడుగా కరకరలాడుతూ, కొద్దిగా ఉప్పగా, కారంగా ఉండే స్నాక్ ఏదైనా ఉంటే ఆ మజాయే వేరు. అలాంటి సమయంలో మనకు ముందుగా గుర్తుకొచ్చేది శనగపిండి కారప్పూస. మార్కెట్లో లభించే రకరకాల బ్రాండ్ల కారప్పూస ప్యాకెట్లలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉండి ఒక్కోసారి రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి.
అయితే చాలా తక్కువ ఖర్చుతో, ఎంతో సులభంగా, మన ఇంట్లోనే కరకరలాడే కారప్పూసను తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి వంటగదిలో ఎప్పుడూ ఉండే సాధారణ పదార్థాలే చాలు.దీన్ని ఒకసారి చేయడం నేర్చుకుంటే పిల్లల నుండి పెద్దల వరకు మళ్లీ మళ్లీ అడిగి మరీ చేయించుకుంటారు. శనగపిండి కారప్పూస ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

శనగపిండి కారప్పూస తయారీకి కావలసిన పదార్థాలు
-శనగపిండి
-ఉప్పు
-కారం
-పసుపు
-వాము
-నూనె
-జంతికల గొట్టం
శనగపిండి కారప్పూస తయారీ విధానం
-పర్ఫెక్ట్ గా రావాలంటే పిండి కలిపే విధానం చాలా ముఖ్యం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, చేతితో కొద్దిగా నలిపిన వాము వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల వేడి నూనె పోసి, పిండికి బాగా పట్టేలా చేతితో రుద్దాలి.
-ఇప్పుడు పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని చపాతీ పిండిలా కాకుండా కాస్త మెత్తగా, మృదువుగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే గొట్టంలోంచి దిగదు, మరీ పల్చగా ఉంటే నూనె పీల్చేస్తుంది. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడి చేయండి. పిండిని జంతికల గొట్టంలో (సన్నటి రంధ్రాలు ఉన్న ప్లేట్ వేసి) నింపుకోండి. నూనె వేడెక్కాక, మంటను మీడియంలో ఉంచి గొట్టాన్ని నొక్కుతూ నూనెలో గుండ్రంగా కారప్పూసను ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒకే చోట ఒత్తకూడదు.
-మీడియం మంటపైనే కారప్పూస లేత బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించాలి. వేగిన తర్వాత తీసి టిష్యూ పేపర్ ఉన్న పళ్ళెంలో వేస్తే, అదనపు నూనెను అది పీల్చేసుకుంటుంది. మిగిలిన పిండిని కూడా ఇలాగే వేయించుకోవాలి.
-వేయించిన కారప్పూస పూర్తిగా చల్లారిన తర్వాత దానిని కొద్దిగా విరిచి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇది చాలా రోజుల పాటు తాజాగా, కరకరలాడుతూ ఉంటుంది. సాయంత్రం టీతో పాటు స్నాక్స్ లా తినడానికే కాకుండా, భేల్ పూరి, చాట్ వంటి వాటిలో పైన చల్లుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications