Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
రెస్టారెంట్ స్టైల్ ఆలు ఫ్రై ఇంట్లోనే..ఆ పొడి కలిపి ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
మనం సాధారణంగా ఇంట్లో ఎప్పుడూ ఒకే రకమైన బంగాళాదుంప వేపుడు లేదా కుర్మా చేస్తుంటాం. ఈసారి కాస్త వెరైటీగా, రెస్టారెంట్ స్టైల్ కంటే అద్భుతమైన రుచితో బంగాళాదుంప ఫ్రైని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
ఒక స్పెషల్ మసాలా పొడి..సాధారణ బంగాళదుంప ఫ్రై కూర రుచిని వేరే లెవల్ కి తీసుకెళ్తుంది. చూస్తేనే నోరూరించే ఈ స్పెషల్ బంగాళాదుంప మసాలా ఫ్రై తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
నూనె -1 టీస్పూన్
వేరుశెనగ గుళ్లు (పల్లీలు)- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -5
ఎండు మిరపకాయలు - 2
జీలకర్ర - అర టీస్పూన్
ధనియాలు లేదా కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
బంగాళాదుంపలు - 2
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు -అర టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసేయాలి. వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉంటే వేపుడు బాగా వస్తుంది.
-స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అవి కాస్త వేగాక ఎండుమిర్చి, వేరుశెనగ గుళ్లు వేసి దోరగా వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడే కూరకి అసలైన రుచిని ఇస్తుంది.
-అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడనీయాలి. మినపప్పు బంగారు రంగులోకి వచ్చాక కూర రుచి బాగుంటుంది.
-తాలింపు వేగాక ముందుగా కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేయాలి. ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు చల్లి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం లో పెట్టి 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఆవిరికి ముక్క మెత్తబడుతుంది.
-బంగాళాదుంప ముక్కలు 80శాతం ఉడికిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల మసాలా పొడిని ముక్కల పైన చల్లాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కలపాలి.
-ఇప్పుడు మూత పెట్టకుండా మరో 2 నిమిషాలు సన్నని మంటపై వేయించాలి. ఇలా చేయడం వల్ల ముక్క క్రిస్పీగా మారుతుంది. అంతే గుమగుమలాడే స్పెషల్ పల్లీ కారం బంగాళాదుంప ఫ్రై రెడీ.
-సాంబార్, రసం అన్నంలోకి సైడ్ డిష్ గా ఇది సూపర్ కాంబినేషన్. ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే దీనికి మించిన రుచి మరొకటి ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
