Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సీతాఫలంతో ఖీర్, మిల్క్ షేక్.. ఒక్కసారి టేస్ట్ చేస్తే వహ్వా అనాల్సిందే!
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. సహజసిద్ధంగా పండే ఈ పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ A, Cతో పాటు యాంటీ యాక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు లభించే ఈ పండును చాలా మంది తింటూ ఉంటారు. అయితే వీటితో స్వీట్స్ కూడా చేసుకోవచ్చని తెలియదు. ఈ రోజు సీతాఫలంతో స్వీట్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సీతాఫలాలతో ఖీర్‌తో పాటు మిల్క్ షేక్ కూడా చేసుకోవచ్చు. అయితే ఆ స్వీట్స్‌ని ఎలా చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు అనేది ఈ స్టోరీలో వివరించాం చూడండి.
సీతాఫలం ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక లీటర్ చిక్కటి పాలు
గింజలు తీసిన ఒక కప్పు సీతాఫలం గుజ్జు
సరిపడ చెక్కెర
రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు
ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్
పంచదార కలపని యాభై గ్రాముల పచ్చికోవా
ఒక టీ స్పూన్ యాలకుల పొడి

సీతాఫలం ఖీర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఆ పాలను మరిగించుకోవాలి. అనంతరం స్టవ్ తక్కువ చేసి.. అందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని.. పాలు గిన్నెలో సగం అయ్యేంతవరకు మరిగించుకోవాలి. ఆ తరువాత ఆ పాలలో ఈ ఖీర్ చేయడానికి సరిపడా చెక్కెర, 50 గ్రాముల పచ్చికోవా వేసుకొని కలుపుకోవాలి.
అనంతరం చెక్కెర తియ్యగా ఉందా లేదా ఇంకొంచెం వేయాల్సి వస్తే వేసుకోవచ్చు. రుచికి సరిపడా చెక్కర వేసుకున్న తరువాత.. కోవా మొత్తం కరిగే విధంగా కలుపుతూ మరిగించుకోవాలి. తరువాత ముందుగా గింజలు తీసిపెట్టుకున్న సీతాఫలం గుజ్జును పాలలో వేసుకొని.. ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఖీర్ దగ్గరపడ్డ తరువాత కిందకి దించుకుంటే.. సీతాఫలం ఖీర్ సిద్ధమైనట్లే.
దీనిని వేడివేడిగా అయినా తినొచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఎలా తిన్నా దీనికి సంబంధించిన రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒకసారి తింటే ఇంకోసారి తినే విధంగా ఉంటుంది.
సీతాఫలం మిల్క్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఒక లీటర్ చిక్కని పాలు
రెండు పండిన సీతాఫలాలు
రెండు టేబుల్ స్పూన్ల చెక్కర
అయిదు జీడిపప్పు,
అయిదు బాదంపప్పు
సీతాఫలం మిల్క్ షేక్ తయారీ విధానం
ముందుగా సీతాఫలం నుంచి గుజ్జు తీసి ఒక కప్పులో వేసుకోవాలి. అనంతరం ఒక మిక్సీలో సీతాఫలం గుజ్జు, జీడిపప్పు, బాదంపప్పు, పంచదార(కావాలనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు), పాలు వేసుకొని బాగా కలిపేవిధంగా బ్లెండ్ చేసుకోవాలి. అనంతరం మిల్క్ షేక్‌పై డ్రై ఫ్రూట్స్ తురుము, కొంచెం సీతాఫలం గుజ్జును గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అనంతరం ఆ మిల్క్ షేక్‌ను ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications