Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్
ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం పూట లంచ్ బాక్స్ లోకి ఏం వండాలి? తక్కువ సమయంలో, రుచికరంగా ఏది చేస్తే బాగుంటుంది? అని తరచుగా ఆలోచిస్తున్నారా? అయితే ఈ వంకాయ రైస్ మీ కోసమే. వంకాయతో కేవలం 20 నిమిషాల్లో చేసుకునే ఈ రైస్ రెసిపీ అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ లో పిల్లలకు, పెద్దలకు ఎవరికి పెట్టినా ఒక్క మెతుకు కూడా వదలకుండా బాక్స్ ఖాళీ చేసి ఇంటికి తెస్తారు.

వంకాయ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-తెల్ల నువ్వులు
-కరివేపాకు
-వంకాయలు
-వండిన అన్నం
-పల్లీలు
-నూనె
-ఆవాలు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-కరివేపాకు
ఉల్లిపాయ
-ఉప్పు
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
వంకాయ రైస్ తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టండి. అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పల్లీలు (వేరుశనగ గుళ్లు), 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, కొద్దిగా కరివేపాకు వేసి సన్నపు మంట మీద దోరగా వేయించుకోవాలి. కమ్మటి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి, అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడే మన వంకాయ రైస్‌కు అసలైన రుచిని, సువాసనను ఇస్తుంది.
-ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కాక అర టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ పచ్చి శనగపప్పు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే ఒక ఎండుమిర్చి, కరివేపాకు, గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
-పోపు చక్కగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కోసి అందులో వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారి పారదర్శకంగా అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు 3 వంకాయలను తీసుకుని, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసి కడాయిలో వేయాలి.
-వంకాయ ముక్కలు నూనెలో మగ్గి, మెత్తబడే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. వంకాయలు మృదువుగా ఉడికిన తర్వాత అందులో పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి.
-మసాలాల పచ్చివాసన పోయి, కూర నుండి నూనె పైకి తేలే వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్లుగా 1 టీస్పూన్ ఉప్పు, ముందుగా వండి పెట్టుకున్న ఒకటిన్నర కప్పుల అన్నం (అన్నం పొడిపొడిగా ఉంటే చాలా బాగుంటుంది) వేయాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ-నువ్వుల పొడిని కూడా చల్లి బాగా కలపాలి. మసాలా, అన్నం ఒకదానికొకటి బాగా పట్టేలా నిదానంగా కలుపుకోవాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, మరోసారి కలిపి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో గుమగుమలాడే, వేడి వేడి వంకాయ రైస్ రెడీ.
-దీన్ని కరకరలాడే ఆలు చిప్స్ తో గానీ, అప్పడాలతో గానీ లేదా మీకు నచ్చిన ఏదైనా వెజ్, నాన్ వెజ్ కర్రీతో గానీ వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
