Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నోరూరించే మష్రూమ్ పరాఠా..తింటూనే బరువు తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే..
పరాఠా అంటే ఇష్టమా? కానీ బరువు పెరుగుతామన్న భయంతో దానికి దూరంగా ఉంటున్నారా? అయితే ఇకపై మీకిష్టమైన పరాఠాను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మామూలు పరాఠాలకు బదులుగా పోషకాల గని అయిన మష్రూమ్ పరాఠాను ప్రయత్నించి చూడండి. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మష్రూమ్ పరాఠా ఒక వరంలాంటిది. సాధారణంగా పరాఠాలు కేలరీలతో నిండి ఉంటాయి, కానీ ఈ పరాఠా అందుకు పూర్తి భిన్నం. పుట్టగొడుగులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పరాఠాను అల్పాహారంలో తీసుకుంటే, రోజంతా కావాల్సిన శక్తి లభించి, మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. నోరూరించే మష్రూమ్ పరాఠా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - 1 కప్పు
పుట్టగొడుగులు - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం-వెల్లుల్లి ముద్ద - 1 టీస్పూన్
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కారం - పావు టీస్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
ఓట్స్ పొడి లేదా శనగపిండి - 1 టేబుల్ స్పూన్
ఆలివ్ నూనె లేదా దేశీ నెయ్యి - కాల్చడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ తీసుకొని, అందులో అర టీస్పూన్ నూనె వేడి చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పుట్టగొడుగులను వేసి వాటిలోని నీరంతా ఆవిరైపోయి పొడిగా అయ్యేవరకు సుమారు 4-5 నిమిషాలు వేయించాలి.
-ఇప్పుడు స్టవ్ ఆపేసి పాన్ లోనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, ఓట్స్ పొడి లేదా శనగపిండి వేసి కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మరింత మృదువుగా రావడానికి కొద్దిగా పెరుగు కూడా కలుపుకోవచ్చు.
-కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఒక ఉండను తీసుకొని చిన్న పూరీలా వత్తి, మధ్యలో 1-2 స్పూన్ల పుట్టగొడుగుల స్టఫింగ్ పెట్టండి. అంచులను దగ్గరకు తెచ్చి జాగ్రత్తగా మూసివేసి పొడి పిండి చల్లుకుంటూ నిదానంగా పరాఠాలా వత్తండి.
-తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ పెనం వేడి చేసి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయండి. పరాఠాను పెనంపై వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే నోరూరించి మష్రూమ్ పరాఠా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications