Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
లొట్టలేసుకుంటూ తినే లసుని మేథి కర్రీ..ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే
చలికాలంలో మార్కెట్లో తాజా ఆకుకూరలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆకుపచ్చని కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎప్పుడూ చేసుకునే మెంతి కూర, పప్పు కాకుండా కాస్త కొత్తగా, రెస్టారెంట్ రుచిని తలపించేలా ఏదైనా తినాలనిపిస్తోందా? అయితే లసుని మేథి ట్రై చేయాల్సిందే. దీనిని వెల్లుల్లి మెంతి కూర అని కూడా పిలుస్తారు.
మెంతి ఆకులోని స్వల్ప చేదు, వెల్లుల్లి ఘాటైన రుచి,భారతీయ మసాలాల కమ్మని సువాసనల కలయికే ఈ వంటకం. ఇది కేవలం నిమిషాల్లో తయారవుతుంది కానీ దీని రుచి మాత్రం మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది. వేడి వేడి రోటీల్లోకి లేదా అన్నంలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్. దాబా స్టైల్ లసుని మేథి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మెంతి కూర - 1 పెద్ద కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 15 నుండి 20
ఉల్లిపాయలు - 3
టమోటాలు - 3
నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు -సరిపడా
వేరుశనగ పప్పు (పల్లీలు) - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - 1 టీస్పూన్
వేయించిన శనగపప్పు (పుట్నాల పప్పు) - 1 టీస్పూన్

తయారీ విధానం
-మొదటగా మెంతి కూర కట్టను తీసుకుని, ఆకులను వేరు చేసి నీటిలో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆకులను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వేరుశెనగలు, తెల్ల నువ్వులు,పుట్నాల పప్పును దోరగా వేయించండి. అవి చల్లారాక మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి 10 వెల్లుల్లి రెబ్బలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. వెల్లుల్లి వేగిన తర్వాత అందులో తరిగిన మెంతి ఆకును వేసి తక్కువ మంట మీద మూత పెట్టి ఉడికించండి. ఉడికిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు పాన్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేశాక ఇందులో జీలకర్ర, చిటికెడు ఇంగువ వేయండి. జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపండి. తర్వాత తరిగిన టమోటాలను వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు ఉడికించాలి.
-టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పేస్ట్ వేసి బాగా కలపాలి. గ్రేవీ నుండి నూనె వేరు పడుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి-మెంతి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపండి.
-అవసరమైతే కొద్దిగా వేడి నీరు పోసి గ్రేవీ చిక్కదనాన్ని సరిచేసుకోండి. మరో 2 నిమిషాలు సన్నని మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన లసుని మేథి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications