Latest Updates
-
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్‌లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.? -
మహిళల్లో పీరియడ్స్, ఫిట్నెస్ సమస్యలకు చెక్ పెట్టే ప్రొటీన్ పౌడర్.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా చేసేయండి -
ఉల్లి, వెల్లుల్లి లేకుండా పూరీ, బగారాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆలూ టమాటర్ గ్రేవీ.. ఈ తాలింపుతోనే అసలు మజా.! -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
చర్మ సౌందర్యాన్ని ఇట్టే పెంచే పాలకూర.. దాబా స్టైల్‌లో నోరూరించేలా ఇలా చేయండి.!
పనీర్ పాలక్, కాజు పాలక్, పాలకూర పప్పు, పాలకూర ఫ్రై ఇలా చాలా రకాలు పాలకూరతో ట్రై చేసి ఉంటారు. పాలకూరతో ఏ వంటకం చేసినా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలా రొటీన్ కాకుండా దాబా స్టైల్‌లో లసూని పాలక్ ట్రై చేసి చూడండి. చపాతీ, రోటీ, పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది.

ఆకుకూరల్లో అమృతమైనది పాలకూర. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాలుగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఏ, కే, ఫొలేట్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మినహా అందరూ పాలకూర తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. అయితే ఇప్పుడు పాలకూరతో దాబా స్టైల్‌లో సరికొత్త వంటకం ట్రై చేద్దాం.
దాబా స్టైల్ లసూని పాలక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పాలకూర- రెండు కట్టలు
పచ్చిమిర్చి- 5
బేకింగ్ సోడా- పావు టీస్పూన్
పంచదార- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
జీడిపప్పు- 15
ఆయిల్- ఆరు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- పావు టీ స్పూన్
ఎండుమిర్చి- నాలుగు
ఉల్లిపాయ- మూడోవంతు కప్పు
పసుపు- పావు టీస్పూన్
కారం- టేబుల్ స్పూన్
ధనియాల పొడి- టేబుల్ స్పూన్
వేయించిన జీలకర్ర పొడి- టీస్పూన్
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
కట్ చేసిన వెల్లుల్లి- నాలుగు టేబుల్
స్పూన్లు
దాబా స్టైల్ లసూని పాలక్ తయారీ విధానం
ముందుగా పాలకూరను కొంచెం కాడలు ఉండేవరకు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి పాలకూర, ఉప్పు, బేకింగ్ సోడా, చక్కెర వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన పాలకూరను జల్లెడ ద్వారా వేరు చేసి చల్లటి నీళ్లతో కడిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు పాలకూరన, జీడిపప్పును కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. దోరగా వేగా ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి కలపాలి.
పాన్‌లో ఉల్లిపాయ, కారం ఉడుకుతుండగా కొన్ని నీళ్లు పోసి మరిగాక పాలకూర, జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. ఈ గ్రేవీ బాగా ఉడికి మంచి సువాసన వస్తుండగా.. వేరే స్టవ్‌పైన చిన్న తాలింపు కడాయి పెట్టుకుని వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. అందులో వెల్లుల్లి, ఎండుమిర్చి వేగనివ్వాలి. ఈ తాలింపు పాలకూర గ్రేవీలో కలపాలి. అంతే రుచికరమైన దాబా స్టైల్ లసూన్ పాలక్ ఇంట్లోనే రెడీ. ఇది చపాతీ లేదా రోటీలోకి అద్భుతంగా ఉంటుంది.
పాలకూర ప్రయోజనాలు
పాలకూరలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. గర్భిణీలకు మేలు చేస్తుంది. ఎముకల బలానికి, కంటి చూపునకు దోహదపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉన్న కారణంగా జీర్ణక్రియ సులభంగా అవుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని విటమిన్ సి, ఎ.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడి సౌందర్యాన్ని పెంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications