Latest Updates
-
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
రెస్టారెంట్ స్టైల్ వంటకాలకు, దాబా స్టైల్ వంటకాలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా రోటీ, చపాతీలోకి దాబా స్టైల్ గ్రేవీ రెసిపీస్ టేస్ట్ ఎవర్ గ్రీన్ అనే చెప్పవచ్చు. మీరూ అలాగే కొత్తగా ట్రై చేయాలనుకుంటే.. ఈ వెజ్ కీమా కర్రీ ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం ఈ కర్రీకి ఫ్యాన్ అయిపోతారు. దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం..

దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీకి కావాల్సిన పదార్థాలు
సోయా చంక్స్- అర కప్పు
పచ్చిమిర్చి- మూడు
పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- అర టీస్పూన్
మసాలా దినుసులు- టీస్పూన్
ఉల్లిపాయ- మీడియం సైజు(ఒకటి)
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
కారం- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- పావు టీస్పూన్
టమాటా- మీడియం సైజు(ఒకటి)
ఉడికించిన పచ్చి బఠాణీ- అర కప్పు
నీళ్లు- అర గ్లాసు
కసూరి మెంతి- కొద్దిగా
వెన్న- రెండు టేబుల్ స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్- టీస్పూన్
గరం మసాలా- టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
ముందుగా చిన్న సైజులో ఉండే సోయా చంక్స్‌ను బౌల్లోకి తీసుకుని అందులో బాగా వేడిగా ఉన్న నీళ్లను పోయాలి. పది నిమిషాల తర్వాత వాటిలోని నీళ్లను మొత్తం పిండుకోవాలి.
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.!
ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకుని అందులో మూడు కట్ చేసిన పచ్చిమిర్చి, పెరుగు వేసి రుబ్బుకోవాలి.
స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో నూనె వెసి వేడయ్యాక జీలకర్ర, మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి దోరగా వేగనివ్వాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి.
ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మొత్తగా ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠాణీ వేసి వేగనివ్వాలి.
తర్వాత మిక్సీలో వేసి రుబ్బిన సోయా చంక్స్ ముద్దను వేసుకుని కలుపుకోవాలి. నూనె పైకి తేలుతూ ఉడికిన తర్వాత అందులో అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి.
వెన్న, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా వేసి కలిపి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
