Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
మండుటెండల్లో ప్రాణం లేచిరావాలా? ఈ సమ్మర్ లో బెల్లం కోల్డ్ కాఫీ ట్రై చేయండి!
భానుడి ప్రతాపంతో మండుతున్న వేసవి ఎండల్లో అలిసిపోయి ఇంటికి రాగానే.. ఒక గ్లాసు చల్లటి కోల్డ్ కాఫీ గొంతులో పడితే ఆ కిక్కే వేరు. శరీరాన్ని, మనసును ఏకకాలంలో సేదతీర్చే అద్భుతమైన డ్రింక్ ఇది. కానీ మీరు ప్రాణంగా ప్రేమించే మీ కాఫీకి ఏనాడైనా ఒక ఆరోగ్యకరమైన ట్విస్ట్ ఇవ్వాలని ఆలోచించారా?
ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిట్ నెస్ ప్రియుల మధ్య విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంటున్న దేశీ డ్రింక్ బెల్లం కోల్డ్ కాఫీ. తెల్ల చక్కెర శరీరానికి కేవలం క్యాలరీలను మాత్రమే అందిస్తుంది, దాని వల్ల ఎలాంటి పోషక విలువలూ ఉండవు. కానీ మన సాంప్రదాయ తీపి పదార్థమైన బెల్లం పోషకాల గని.

వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, చల్లబరచడంలో,నీరసాన్ని తరిమికొట్టి తక్షణ శక్తిని అందించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. కేఫ్ ను మించిన రుచితో, ఆరోగ్యంతో కూడిన బెల్లం కోల్డ్ కాఫీని ఇంట్లోనే ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
బెల్లం కోల్డ్ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కాఫీ పొడి - 1 టేబుల్ స్పూన్
బెల్లం - 2 టేబుల్ స్పూన్లు
బాగా చల్లబరిచిన పాలు - 1 పెద్ద కప్పు
ఐస్ క్యూబ్స్ - 3
గోరువెచ్చని నీరు - ఒకటి లేదా రెండు టీస్పూన్లు
బెల్లం కోల్డ్ కాఫీ తయారీ విధానం
-ముందుగా ఒక చిన్న కప్పు లేదా గ్లాసు తీసుకోండి. అందులో కాఫీ పొడి, బెల్లం పొడి,కొద్దిగా గోరువెచ్చని నీటిని వేయండి.
-ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని, బెల్లం పూర్తిగా కరిగి, మిశ్రమం చక్కటి నురుగు వచ్చే వరకు బాగా గిలకొట్టండి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని, అందులో చల్లటి పాలు, ముందుగా రెడీ చేసుకున్న కాఫీ-బెల్లం డికాషన్, ఐస్ క్యూబ్స్ వేయండి. ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చిక్కటి, మృదువైన నురుగు పైకి తేలే వరకు బాగా బ్లెండ్ చేయండి.
-అంతే ఎంతో ఆరోగ్యకరమైన, కమ్మని రుచితో కూడిన బెల్లం కోల్డ్ కాఫీ రెడీ. దీన్ని ఒక పొడవైన గ్లాసులో పోసి, పైన గార్నిష్ కోసం కొద్దిగా కాఫీ పొడి చల్లుకొని తాగుతుంటే ఆ మజానే వేరు.
-రెగ్యులర్ చక్కెర కాఫీతో పోలిస్తే దీని రుచి కొంచెం భిన్నంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. బెల్లంలోని సహజమైన తీపి, కాఫీలోని చేదును అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధి లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల తీపికి దూరంగా ఉండాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications