Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
నూనెలో డీప్ ఫ్రై అక్కర్లేదు..పొంగనాల పాన్ లోనే జ్యూసీ జ్యూసీ బాదుషా చేసుకోండిలా..
బాదుషా అనేది రుచికరమైన సాంప్రదాయ వంటకం. తెలుగు వారు ఎక్కువగా ఇష్టపడే స్వీట్స్ లో బాదుషా ఒకటి. సాధారంగా తీపి వంటకాలు తినడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. బాదుషా వంటి రుచికరమైన సాంప్రదాయ తీపిని తినడం వల్ల పండుగ వాతావరణంలో లేదా ప్రత్యేక సందర్భాలలో మానసిక ఉల్లాసం లభిస్తుంది. సాధారణంగా బాదుషాను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. పొంగనాల పాన్ ఉపయోగించి నూనే లేకుండా జ్యూసీగా బాదుషాని స్వీట్ షాపుకి మించిన రుచితో ఇంట్లోనే ఎలా తయారు చేయవచ్చో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదా పిండి
-చక్కెర
-యాలకల పొడి
-నెయ్యి
-నిమ్మరసం
-వంటసోడా

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు(50గ్రా) నెయ్యి, పావు టీస్పూన్ వంటసోడా, 1 టీస్పూన్ చక్కెర వేసి బాగా బీట్ చేసుకోండి. నురగలు నురగలు వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకుంటే గ్లాసు అడుగును ఉపయోగించి అయినా బీట్ చేసుకోవచ్చు.
-ఇప్పుడు అందులోనే ఒకటింపావు కప్పు(150గ్రా)మైదా పిండి వేసి నెయ్యి మొత్తం పిండికి బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి.
-తర్వాత అందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిని కలుపుకున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవద్దు.
-ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కలిపిన పిండిముద్దకు రెండు వైపులా చేతితో అద్ది పిండిముద్దను ఓ బాక్సులో లేదా గిన్నెలో పెట్టి మూతపెట్టి అరగంట సేపు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 కప్పు(200గ్రా) చక్కెర, 1 కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద చక్కెరను జిగురు జిగురుగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అక్కర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి అందులో కొంచెం యాలకల పొడి, అర టీస్పూన్ నిమ్మరసం, కొంచెం నెయ్యి వేసి కలుపుకొని మూతపెట్టి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అరగంట సేపు నానిన పిండిని బయటకు తీసి కొంచెం కొంచెంగా చేతుల్లోకి పిండిని తీసుకొని చిన్న చిన్నవిగా మధ్యలో రంధ్రం పెట్టుకుంటూ బాదుషాల్లా వత్తుకోవాలి. పొంగనాల పాన్ గుంటల్లో పెట్టడానికి సరిపడే సైజులో బాదుషాలను వత్తుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పొంగనాల పాన్ పెట్టి అందులో ఒక్కో గుంటలో ఒక్కో టీస్పూన్ నెయ్యి వేసి పాన్ వేడెక్కాక మంటను పూర్తిగా తగ్గించి పాన్ గుంటల్లో ఒక్కో బాదుషాను పెట్టి మూతపెట్టేసి అంచులు బాగా ఎర్రగా మారేదాకా కాలనివ్వాలి. తర్వాత మూతీసి బాదుషాను రెండో వైపుకి తప్పి మూతపెట్టి బాగా ఎర్రగా కాలనిచ్చి బయటకు తీసుకోవాలి.
-ఇప్పుడు బాదుషాలను ముందుగా రెడీ చేసి ఉంచి వేడి చక్కెర పాకంలో వేసుకోవాలి. బాదుషాలు వేడిగా ఉండాలి,అలాగే పాకం కూడా వేడిగా ఉండాలి. 20 నిమిషాలు పాకంలో బాదుషాలను నాననివ్వాలి. తర్వాత పాకం రాకుండా వీటిని బయటకు తీసుకోండి. అంతే జ్యూసీ జ్యూసీ బాదుషా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications