Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
జలుబు, దగ్గు మాయం..ఈ ఒక్క మసాలాతో వేడి పుట్టించే చికెన్ కర్రీ..చలికాలంలో ఇంతకంటే ఏం కావాలి
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఏదైనా తినాలని అనిపించడం సహజం. అయితే స్పైసీగా ఉండటమే కాకుండా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు బాడీని వెచ్చగా ఉంచి జలుబు, దగ్గు వంటివి రాకుండా నోటికి ఎంతో రుచిగా ఉంటేలా చేసే స్పెషల్ చికెన్ కర్రీని కుక్కర్ లో ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-నాటు కోడి చికెన్
-ధనియాలు
-మిరియాలు
-యాలకలు
-లవంగాలు
-జాపత్రి
-అనాస పువ్వు
-జీలకర్ర
-దాల్చిన చెక్క
-ఆయిల్
-ఉప్పు
-కారం
-పసుపు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-కొత్తిమీర
-అల్లం
-అల్లంవెల్లుల్లి పేస్ట్

తయారీ విధానం
-ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 8 యాలకలు, 5 లవంగాలు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం జాపత్రి, 1 అనాస పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి తక్కువ మంట మీద నూనె లేకుండానే 4-5 నిమిషాలు వేయించాలి.
-మసాలాలలో పచ్చిదనం పోయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించినవన్నీ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి వాసన పోకుండా ఉంటడం కోసం రెడీ అయిన పొడి మీద మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు కూర తయారీ కోసం.. కిలో పావు(1250గ్రా)నాటు కోడి ముక్కలను తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టి అందులో ముప్పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కలు, సన్నగా కట్ చేసిన 10 పచ్చిమిరపకాయల ముక్కలు, గుప్పెడు పుదీనా, 2 రెమ్మల కరివేపాకు వేసి మీడియం మంట మీద కలుపుతూ వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ పసుపు వేసి ఇందులోని పచ్చివాసన పోయేదాకా 2-3 నిమిషాలు కలుపుతూ వేయించుకున్నాక కడిగిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి పెద్ద మంట మీద 5 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.
-తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద చికెన్ ముక్కలను ఉడకనివ్వాలి.

-చికెన్ ముక్కల్లో నుంచి నీళ్లు ఊరడం స్టార్ట్ అయినప్పుడు ఆ నీళ్లు కూడా ఆవిరి అయ్యేదాకా మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి.
-తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి మరో 5 నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించాలి.
-ఉప్పు కారం కూరకి పట్టి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ముక్కల మీద చల్లి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.2 కప్పుల వేడి నీళ్లు కూడా ఇందులో పోసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. ముదురు చికెన్ అయితే మూతతీసి ఉడకలేదనుకుంటే మరో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి.
-తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం కొంచెం వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే టేస్టీ చికెన్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications