కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్‌ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా..

Posted By:

రోజంతా మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా పనిచేయాలంటే మీ శరీరానికి ఉదయాన్నే సరైన ఇంధనం అవసరం. ఉదయం పూట ప్రొటీన్లు ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే.. అది మిమ్మల్ని గంటల తరబడి చురుకుగా ఉంచడమే కాకుండా, ఆకలిని నియంత్రించి మీ ఏకాగ్రతను పెంచుతుంది. వంటగదిలో గంటల తరబడి గడపకుండానే, కేవలం పది నిమిషాల్లో చేసుకోగలిగే అద్భుతమైన రెసిపీ ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్.

Egg Avocado Khakhra Chaat Recipe in Telugu Make 10 Minute High Protein Breakfast at home

ప్రముఖ వెల్‌ నెస్ కంటెంట్ క్రియేటర్, పోషకాహార నిపుణురాలు ఖుషీ ఛబ్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఆరోగ్యకరమైన, రుచికరమైన, హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ రెసిపినీ షేర్ చేశారు. గుడ్లు, అవకాడోల కలయికతో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ బరువు తగ్గాలనుకునేవారికి, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎనర్జిటిక్‌ గా ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని ఆమె చెప్పారు.

ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ తయారీకి కావలసిన పదార్థాలు

గుడ్లు - 2
సగం అవకాడో- ముక్కలుగా కోసుకోవాలి
కీర దోసకాయ - 1
చిక్కటి పెరుగు (గ్రీక్ యోగర్ట్)- 3 లేదా 4 టేబుల్ స్పూన్లు
గోధుమ ఖాఖ్రా - 1
ఒరేగానో - రుచికి సరిపడా
ఉప్పు - రుచికి తగినంత
నల్ల మిరియాల పొడి - కొద్దిగా

ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ తయారీ విధానం

-మొదటగా ఉడికించిన గుడ్లు, అవకాడో,కీర దోసకాయను సమాన పరిమాణంలో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల తినేటప్పుడు మిశ్రమం అంతా ఒకేలా తగులుతుంది.

-ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గుడ్లు, అవకాడో, దోసకాయ ముక్కలను వేయండి. దానికి చిక్కటి పెరుగు లేదా గ్రీక్ యోగర్ట్‌ ను కలపండి. తర్వాత మీ రుచికి తగినట్లుగా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఒరేగానో చల్లండి. అవకాడో ముక్కలు మరీ మెత్తగా ముద్దలా అయిపోకుండా చూసుకుంటూ.. అన్నీ కలిసేలా సున్నితంగా మిక్స్ చేయండి.

-ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో కరకరలాడే తాజా గోధుమ ఖాఖ్రాను ఉంచండి. ముందుగా సిద్ధం చేసుకున్న ఈ క్రీమీ మిశ్రమాన్ని ఆ ఖాఖ్రా పైన సమానంగా పరచండి.

-అంతే ఎంతో రుచికరమైన ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ రెడీ. ఖాఖ్రా కరకరలాడుతుండగానే వెంటనే వడ్డించండి.

ఆరోగ్య ప్రయోజనాలు

ఈ బ్రేక్‌ ఫాస్ట్ ఒక సంపూర్ణ పోషకాల గని. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, లీన్ ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కలగలిపి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

గుడ్లు, గ్రీక్ యోగర్ట్: ఈ కాంబినేషన్ వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అందుతాయి. ఇవి కండరాల నిర్మాణానికి సహాయపడతాయి.

అవకాడో: గుండెకు మేలు చేసే కొవ్వులు, ఫైబర్ ఇందులో పుష్కలం.

దోసకాయ, ఖాఖ్రా: దోసకాయ డీహైడ్రేషన్ దరిచేరనివ్వదు. ఇక గోధుమ ఖాఖ్రా శరీరానికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తూ, రోజంతా స్టామినాను నిలుపుతుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion