Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే!
ఆదివారం పూట ముక్క లేనిదే ముద్ద దిగని వారు కోకొల్లలు. చికెన్ కర్రీ ఎప్పుడైనా తినొచ్చు కానీ సండే రోజు మాత్రం మటన్ ఉండాల్సిందే అని పట్టుబట్టే నాన్ వెజ్ లవర్స్ చాలా మందే ఉన్నారు.
అయితే ప్రతివారం ఒకేలా రొటీన్ గా ఉల్లిపాయ, టమాటా వేసి మటన్ కర్రీ వండుకుంటే అందులో కిక్ ఏముంటుంది? ఈ సండే దోసకాయ మటన్ ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ దోసకాయ మటన్ కూరను కలుపుకుని తింటుంటే స్వర్గం ఇక్కడే ఉందా అనిపించక మానదు.

దోసకాయ మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత మటన్: ఒక కేజీ
దోసకాయలు: 2
పచ్చిమిరపకాయలు: 8
ఉల్లిపాయలు: 4
పసుపు: అర చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు చెంచాలు
కారం: రెండున్నర చెంచాలు
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా: ఒక చెంచా
నూనె: తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
దోసకాయ మటన్ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో కిలో మటన్ తీసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి నీళ్లన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి.
-అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయలను చెక్కు తీసి, చేదు చూసుకుని లోపలి గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరగాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుతూ సుమారు 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు కాస్త వేగాక, అందులో రెండు చెంచాల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అర చెంచా పసుపు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మటన్‌ను అందులో వేసి గరిటెతో బాగా కలపాలి. (ఒక చిన్న చిట్కా: మటన్ కొనుక్కునేటప్పుడు కాస్త కొవ్వు (ఫ్యాట్) ఉండేలా చూసుకుంటే కూరకు అదనపు రుచి వస్తుంది). మటన్ వేసాక మూత పెట్టి మీడియం మంటపై 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
-మటన్ లో నీరు ఊరుతున్న సమయంలో.. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసి మరోసారి కలపాలి.
-ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా రెండున్నర చెంచాల కారం, సరిపడా ఉప్పు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. ఆ తర్వాత మటన్ ఉడకడానికి సరిపడా (సుమారు 2 గ్లాసుల) నీళ్లు పోసి కలపాలి.
-గిన్నెపై మూత పెట్టి మటన్ ముక్కలు మెత్తగా ఉడికేవరకు సన్నపు మంటపై మగ్గనివ్వాలి. కుక్కర్ అయితే 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి.
-మటన్ బాగా ఉడికి, నూనె పైకి తేలుతున్న సమయంలో.. ఒక చెంచా గరం మసాలా చల్లుకుని బాగా కలపాలి. మరో 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత మంట ఆపేయాలి. అంతే దోసకాయ మటన్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications