Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అడవి బిడ్డల అద్భుత వంటకం..జార్ఖండ్ స్టైల్ సీతాఫలం చట్నీ ఎలా చేయాలంటే..
జార్ఖండ్ రాష్ట్రం ప్రకృతి అందాలకు, అటవీ సంపదకు ఎంత ప్రసిందో, అక్కడి ఆహారపు అలవాట్లు కూడా అంతే ప్రత్యేకమైనవి. అక్కడి గిరిజన సంప్రదాయ వంటకాలు చాలా వరకు అడవిలో లభించే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మీద ఆధారపడి ఉంటాయి. అందులో ఒక ప్రత్యేకమైన, రుచికరమైన వంటకం సీతాఫల్ చట్నీ.
మనం సాధారణంగా సీతాఫలాన్ని పండులా మాత్రమే తింటాము, కానీ జార్ఖండ్ లో దీనిని అన్నం లేదా రోటీలతో తినేలా కమ్మని పచ్చడిలా కూడా చేస్తారు. సీతాఫలం సహజంగానే తీపిగా ఉంటుంది. దీనికి పచ్చిమిర్చి, ఆవనూనె, ఇతర సుగంధ ద్రవ్యాలు జోడించడం వల్ల వచ్చే తీపి, కారం, పులుపు కలగలిసిన రుచి అద్భుతంగా ఉంటుంది. జార్ఖండ్ స్టైల్ సీతాఫల్ చట్నీ మీ ఇంట్లోనే ఎలా చేపుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
దోరగా పండిన సీతాఫలాలు: 2-3
పచ్చిమిర్చి: 2-3
వెల్లుల్లి రెబ్బలు: 4-5
కొత్తిమీర: ఒక చిన్న కట్ట
పుదీనా: గుప్పెడు
ఆవనూనె: 1 టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
నల్ల ఉప్పు: రుచికి సరిపడా
సాధారణ ఉప్పు: చిటికెడు
వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
ముందుగా సీతాఫలాలను బాగా కడిగి, రెండు ముక్కలుగా చేయాలి. ఒక స్పూన్ సహాయంతో లోపలి గుజ్జును గింజలతో సహా ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు చేతులతో గానీ లేదా బ్లెండర్లో చాలా తక్కువ స్పీడ్ మీద ఒక్కసారి తిప్పి గానీ గింజలను గుజ్జు నుండి వేరు చేయాలి. గుజ్జు ముద్దగా కాకుండా కొంచెం పలుకులుగా ఉంటే చట్నీ రుచి బాగుంటుంది. గింజలు పూర్తిగా తీసేయాలి.
ఇప్పుడు రోలు లేదా మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఆకులను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ పేస్ట్ లా చేయకూడదు. ఈ మిశ్రమం చట్నీకి మంచి రంగును, ఘాటును ఇస్తుంది.
ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గింజలు తీసిన సీతాఫలం గుజ్జును తీసుకోండి. దీనికి ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి-వెల్లుల్లి మిశ్రమాన్ని కలపండి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేయండి.
చివరగా జార్ఖండ్ టచ్ కోసం ఒక టీస్పూన్ పచ్చి ఆవనూనె, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఆవనూనె వాడటం ఇష్టం లేనివారు నువ్వుల నూనె వాడవచ్చు, కానీ అసలైన రుచి ఆవనూనెతోనే వస్తుంది. అంతే సీతాఫల్ చట్నీ రెడీ.
ఈ చట్నీని వేడి వేడి అన్నం, జొన్న రొట్టెలు లేదా చపాతీలతో సైడ్ డిష్ గా వడ్డించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
