Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
బాంబే కరాచీ హల్వా..ఇది స్వీట్ కాదు అమృతం..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
దక్షిణాసియాలో చాలా పాపులర్ స్వీట్ బాంబే కరాచీ హల్వా. దీనిని కరాచీ హల్వా అని కూడా పిలుస్తుంటారు. స్వీట్లలో ఇది కింగ్ అని చెప్పొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. కరాచీ హల్వా నిజానికి పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి చెందిన సంప్రదాయ తీపి పదార్థం. దీనిని భారతదేశానికి చందు హల్వాయ్ కుటుంబం తీసుకువచ్చింది. 1947లో దేశ విభజన తర్వాత కరాచీ నుండి వలస వచ్చిన సింధీలు ఈ హల్వాను ముంబైలో అమ్మడం ప్రారంభించారు. ఇది క్రమంగా ముంబై ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి బాంబే హల్వాగా కూడా ప్రసిద్ధి చెందింది. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ఎక్కువగా తయారు చేస్తారు. దీనిని తయారు చేయడం కొంచెం కష్టమైనప్పటికీ సరైన కొలతలు, చిట్కాలతో ఇంట్లోనే అద్భుతమైన కరాచీ హల్వాను ఎలా తయారుచేయవచ్చో ఇక్కడ చూడండి.
బాంబే కరాచీ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-కార్న్‌ఫ్లోర్: 1 కప్పు(150 గ్రాములు)
-చక్కెర: 3-4 కప్పులు
-నెయ్యి: 1 కప్పు
-నిమ్మరసం: 2 టీస్పూన్స్
-ఫుడ్ కలర్: 1/4 టీస్పూన్
-యాలకుల పొడి: 1/2 టీస్పూన్
-తరిగిన డ్రై ఫ్రూట్స్: 1/4 కప్పు

తయారీ విధానం
-ఒక పెద్ద గిన్నెలో 1 కప్పు కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి) వేసి ఇందులో 2 కప్పుల నీటిని నెమ్మదిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపండి. ఇది పల్చని ద్రవంలా తయారవుతుంది. దీనిని పక్కన ఉంచండి.
-ఇప్పుడు ఒక మందపాటి అడుగున్న కడాయి లో 3 కప్పుల చక్కెర, 3 కప్పుల నీటిని పోయండి.
-మీడియం మంటపై చక్కెర పూర్తిగా కరిగే వరకు కలపండి. పాకం రానవసరం లేదు..చక్కెర కరిగితే సరిపోతుంది. ఈ మిశ్రమానికి నిమ్మరసం వేసి బాగా కలపండి.
-పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి నెమ్మదిగా చక్కెర పాకంలో పోయండి.
-ఇప్పుడు మంటను తగ్గించి గరిటెతో కలుపుతూ ఉండండి. కార్న్‌ఫ్లోర్ త్వరగా గట్టిపడుతుంది కాబట్టి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి.
-సుమారు 5-7 నిమిషాల తర్వాత మిశ్రమం చిక్కబడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నెయ్యిని కొద్దికొద్దిగా (సుమారు 2-3 టేబుల్ స్పూన్లు ఒకసారి) కలుపుతూ ఉండండి.
Mutton Kurma: సూపర్ టేస్టీ మటన్ కుర్మా..నోటికి స్వర్గం అంతే..ఎలా చేసుకోవాలంటే
-మిశ్రమం పారదర్శకంగా, జెల్లీ లాగా అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. దీనికి సుమారు అరగంట పైనే పడుతుంది. ఎంత బాగా కలిపితే హల్వా అంత మెత్తగా, పారదర్శకంగా వస్తుంది.
-ఈ సమయంలో ఒక చిన్న గిన్నెలో 1/4 టీస్పూన్ ఫుడ్ కలర్ ను కొద్దిగా నీటితో కలిపి హల్వా మిశ్రమంలో వేసి బాగా కలపండి.
-మిశ్రమం పారదర్శకంగా, గట్టిగా, కడాయికి అంటుకోకుండా ఒక ముద్దలా మారినప్పుడు, మిగిలిన నెయ్యిని కూడా కొద్దికొద్దిగా కలుపుతూ ఉండండి. హల్వా పూర్తి నెయ్యిని పీల్చుకున్న తర్వాత మిశ్రమం కడాయి అంచులను వదిలి మెరుస్తూ కనిపిస్తుంది.
-చివరగా యాలకుల పొడి, సగం డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి.
-ఒక ట్రే లేదా ప్లేట్‌కు నెయ్యి బాగా రాసి సిద్ధంగా ఉంచుకోండి. హల్వా మిశ్రమాన్ని వేడివేడిగా సిద్ధం చేసుకున్న ట్రేలోకి మార్చండి.
-ఒక గరిటె లేదా స్పూన్ వెనుక భాగాన్ని నెయ్యి అంటించి హల్వాను ట్రేలో సమానంగా సర్దండి. మరీ మందంగా కాకుండా సుమారు 1 అంగుళం మందంతో ఉండేలా చూసుకోండి.
-మిగిలిన డ్రై ఫ్రూట్స్‌తో పైన అలంకరించండి. ఇది పూర్తిగా చల్లబడే వరకు కనీసం 1-2 గంటలు లేదా రాత్రంతా పక్కన ఉంచండి. హల్వా పూర్తిగా చల్లబడిన తర్వాత గట్టిపడుతుంది.
-చల్లబడిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
